»   » క్యూట్ గా వీళ్లిద్దరూ...( “తను నేను” ప్రివ్యూ)

క్యూట్ గా వీళ్లిద్దరూ...( “తను నేను” ప్రివ్యూ)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఉయ్యాల జంపాల చిత్రంతో పరిచయమై తర్వాత వరస హిట్స్ తో దూసుకుపోతున్న అవికాగోర్ నటించిన మరో చిత్రం ఈ రోజు విడుదల అవుతోంది. మహేష్ తో బాబి చిత్రం చేసిన శోభన్ కుమారుడు సంతోష్ శోభన్ హీరోగా చేసిన ఈ చిత్రం క్యూట్ లవ్ స్టోరీగా సాగనుందని సమాచారం. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

అమెరికా వెళ్లాలనే కోరిక, జీవితాశయం ఉన్న అమ్మాయికి, విదేశాలు అంటే పడని కుర్రాడికి మధ్య జరిగే లవ్ స్టోరీ ఇది. ఆలోచనల్లో ఉత్తర దక్షిణ దృవాల్లా ఉండే వీరిద్దరూ ఎలా ఒకటయ్యారు అనే పాయింట్ చుట్టూ కథనం అల్లు కున్నారు. ఇందులో సొంత వాళ్లను, ఊళ్లను వదిలేసి అమెరికా వెళ్లి సెటిల్ అయ్యే ఫ్యామిలీలను,మనుష్యులను అసహ్యించుకునే కుర్రాడిగా కిరణ్ (సంతోష్ శోభన్) కనిపిస్తారు. తన తండ్రి కోరికైన అమెరికా వెళ్లాలనేదాన్ని తీర్చాలనే పట్టుదల ఉన్న అమ్మాయి కీర్తి (అవికాగోర్) చేసింది. పూర్తి ట్రీట్ మెంట్ తో సాగే లవ్ స్టోరీ ఇది.

Avika Gor ’s Tanu Nenu Movie Preview

నిర్మాత, దర్శకుడు రామ్మోహన్‌ మాట్లాడుతూ ‘‘రామానాయుడు ఫిల్మ్‌ స్కూల్‌ విద్యార్థి సాయేష్‌ ఈ కథ రాసుకున్నాడు. అతన్నే డైరెక్ట్‌ చెయ్యమంటే వినకుండా అమెరికా వెళ్లిపోయాడు. దాంతో నేనే డైరెక్ట్‌ చేశాను. ఇదో అర్బన్‌ రొమాంటిక్‌ కామెడీ. క్యూట్‌ లవ్‌స్టోరీ. ‘గోల్కొండ హైస్కూల్‌' సినిమాకి నాతో కలిసి పనిచేసిన సంతోష్‌ ఈ సినిమాలో హీరోగా బాగా నటించాడు'' అని తెలిపారు.

బ్యానర్స్: సన్ షైన్ సినిమా, వయాకామ్ 18 పిక్చర్స్
నటీనటులు: సంతోష్ శోభన్, అవికా గోర్, అల్లరి రవిబాబు, రవిబాబు, సత్యకృష్ణ, కిరీటి దమ్మరాజు, ఆర్కే, రాజశ్రీనాయుడు
సంగీతం: సన్నీ ఎం.ఆర్‌.
ఛాయాగ్రహణం: సురేశ్ సారంగం,
కూర్పు: మార్తాండ్‌ కె. వెంకటేష్ నిర్మాత, దర్శకత్వం: రామ్మోహన్ .పి
సమర్పణ : డి.సురేష్ బాబు
విడుదల తేదీ : 27, నవంబర్ 2015.

English summary
Tanu Nenu was directed by Ram Mohan p while D. Suresh Babu is producing this movie under Viacom 18 Productions. It would be a romantic family and love entertainer starring Avika Gor and Santhosh Shoban in main role.
Please Wait while comments are loading...