»   » ఎవియస్ 'కోతిమూక' చిత్రం ముస్టి మూకా?

ఎవియస్ 'కోతిమూక' చిత్రం ముస్టి మూకా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

నాకు తెలిసి అడుక్కుతినేవాడు అత్యధిక మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టడమన్న అంశంతో ఇంతవరకు సినిమాలు రాలేదు అంటున్నారు ఏవియస్. గతంలో సూపర్ హీరోస్, రూమ్ మేట్స్, ఓరి నా ప్రేమ బంగారం కానూ చిత్రాలు డైరక్ట్ చేసిన ఏవియస్..తాజాగా కృష్ణుడు హీరోగా కోతిమూక చిత్రం రూపొందించారు. ఈ చిత్రం మొన్న శుక్రవారం రిలీజై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సినిమాలో సెకెండాఫ్ మొత్తం ముస్టి గోల ఎక్కువ అవటంలో ఈ చిత్రం ముస్టిమూక అని పేరు తెచ్చుకుంది.

కథ ప్రకారం రమణ(కృష్ణుడు) నాలుగుసార్లు ఎమ్మల్యేగా గెలిచిన జయప్రకాష్ రెడ్డి కొడుకు. అయితే అవినీతి పరుడైన తన తండ్రి అంటే మంచి హృదయమున్న రమణకి గిట్టదు. రమణ...గ్యాడ్యుయేషన్ ఐదో సంవత్సరం కాలేజీలో చదువుతూంటాడు. అతను ఓ అమ్మాయి(శ్రధ్దా ఆర్య) ని ప్రేమిస్తూంటాడు. అయితే ఆమె డిగ్రీ పూర్తి చేసుకుని అదే కాలేజీకి లెక్చరర్ గా వస్తుంది. ఆమె అతన్ని నీ చదువు పూర్తి చేస్తే పెళ్ళి చేసుకుందాం అని ఛాలెంజ్ చేస్తుంది. దాంతో కష్టపడి డిగ్రీ పూర్తి చేసిన రవణకుకు ఆమె నుంచి మరో సమస్య ఎదురవతుంది. ఆమె తండ్రి(ఎవియస్)ఓ ముస్టివాడు అని చెప్పి పెళ్ళి కష్టమంటుంది. అప్పుడు రమణ..ముస్టివాడైన ఎవియస్ ని ఎమ్మల్యేగా తన తండ్రిపై పోటికీ నిలబెట్టి నెగ్గించి..తండ్రికి బుద్ది చెపుతాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu