»   » ఏవీయస్ 'కోతిమూక' ఏం చేస్తుంది?

ఏవీయస్ 'కోతిమూక' ఏం చేస్తుంది?

Posted By:
Subscribe to Filmibeat Telugu

రావణాసురుడి దుమ్ముదులపడానికి కోతిమూక సహాయంతో రాముడు చేసే నిఖార్సయిన యుద్ధమే ఈ 'కోతిమూక' ఇతివృత్తం అంటున్నారు ఏవీయస్. ఆయన చిరకాల విరామం తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని 'కోతిమూక' చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. కృష్ణుడు, శ్రద్ధా ఆర్య జంటగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ..రెండున్నర గంటలపాటు పూర్తి వినోదాన్ని అందించే చిత్రంగా దీన్ని తీస్తున్నాం. 24 నుంచి 55 రోజుల పాటు జరిపే సింగిల్ షెడ్యూలుతో సినిమాని పూర్తిచేస్తాం'' అని చెప్పారు. అలాగే సక్సెస్సే ధ్యేయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను..ఇదివరకు నేను రూపొందించిన మూడు సినిమాలు దరశకుడిగా సంతృప్తినిచ్చినా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు అన్నారు. 'బందిపోటు' చిత్రంలో ఆరుద్ర రాసిన 'ఊహలు గుసగుసలాడే..' పాటని ఇందులో రీమిక్స్ చేస్తున్నామని తెలిపారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu