»   » రవిబాబు ‘అవును-2’విడుదల తేదీ

రవిబాబు ‘అవును-2’విడుదల తేదీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రవిబాబు గతంలో రూపొందించిన ‘అవును' చిత్రానికి సీక్వెల్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘అవును-2' అనే పేరును నిర్ణయించి ఆ మధ్యన ట్రైలర్ ని సైతం విడుదల చేసారు. ఇప్పుడు ఫస్ట్ లుక్ పొస్టర్ ని విడుదల చేసారు. సురేష్ ప్రొడక్షన్స్, ఫ్లయింగ్ ఫ్రాగ్స్ పతాకాలపై రవిబాబు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. హర్షవర్థన్ రానె, పూర్ణ జంటగా రూపొందింది. ఈ చిత్రం మార్చి 6 వ తేదీన విడుదల చేయటానికి దర్శక,నిర్మాతలు నిర్ణయించారు.

రవిబాబు మాట్లాడుతూ ‘‘అవును సినిమా ఎక్కడ ముగిసిందో, అక్కడి నుంచే అవును-2 మొదలవుతుంది. ఆ సినిమాలోని పాత్రలతోనే ఈ సినిమా సాగుతుంది. మరో రెండు, మూడు కొత్త పాత్రలు కూడా యాడ్‌ అవుతాయి. ఈ సినిమాలో సెల్‌కాన్‌ ట్యాబ్‌ కీలక పాత్ర పోషించింది. నిఖిత పాత్ర కూడా ముఖ్యమైనదే. తొలి భాగంలో కనిపించని కెప్టెన్‌ రాజు గురించి ఈ సినిమాలో చూపిస్తున్నాం'' అని అన్నారు.


‘Avunu 2’ arrival on

డి.సురేశ్‌బాబు మాట్లాడుతూ ‘‘అవును-2 సినిమాను రవిబాబు చాలా వైవిధ్యంగా తెరకెక్కిస్తున్నారు. పార్ట్‌ 1 కంటే 2 ఇంకా బావుంటుంది. హారర్‌ సినిమాలను ఎంజాయ్‌ చేయాలనుకునే ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఎంజాయ్‌ చేస్తారు. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం'' అని తెలిపారు.


నిఖిత, సంజన, చక్రవర్తి, రవివర్మ తదితరులు నటిస్తున్న ఈ సినిమాకు స్ర్కీన్‌ప్లే: సత్యానంద్‌, కెమెరా: ఎన్‌.సుధాకర్‌రెడ్డి, సంగీతం: శేఖర్‌చంద్ర, ఎడిటర్‌: మార్తాండ్‌.కె.వెంకటేశ్‌, ఆర్ట్‌: భూపే్‌శ ఆర్‌.భూపతి, రచన, నిర్మాత, దర్శకత్వం: రవిబాబు.

English summary
Harshavardhan Rane, Poorna starrer Avunu 2 plans to release the film on 6th March in a grand manner.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu