»   » బాలీవుడ్ ప్రముఖుల ర్యాలీ: షారుక్ ఖాన్‌కు వ్యతిరేకమా?

బాలీవుడ్ ప్రముఖుల ర్యాలీ: షారుక్ ఖాన్‌కు వ్యతిరేకమా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: దేశంలో అసహనం పెరిగిపోతోందని ఆరోపిస్తూ అవార్డులు తిరిగిస్తోన్న వారికి వ్యతిరేకంగా బాలీవుడ్ ప్రముఖులు ర్యాలీ నిర్వహించనున్నారు. ఢిల్లీలో ఈ నెల ఏడున రాష్ట్రపతి భవన్‌కు ర్యాలీగా వెళ్లాలని సినిమా కళాకారులు, దర్శకులు, నిపుణులు నిర్ణయించారు.

దేశంలో ఆందోళన పడాల్సినంత పరిస్థితేమీ లేదని అనుపమ్ ఖేర్, మధుర్ భండార్కర్, రవీనాటాండన్ అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరిగి ఇవ్వడం ఆయా సంస్థలను అవమానించడమేనని వారు అభిప్రాయపడ్డారు. అవార్డులు తిరిగి ఇస్తున్న వారు అందుకు చెబుతున్న కారణాలు వింటుంటే నవ్వు వస్తోందని చెప్పారు. అవార్డులు తిరిగి ఇస్తున్న వారు దేశంలో ఇంతకన్నా అసహనం ఎక్కువున్న సమయంలో ఎందుకివ్వలేదని ప్రశ్నిస్తున్నారు. ర్యాలీలో తాము కూడా పాల్గొంటున్నట్లు తెలిపారు.

Award Wapsi: Bollywood organise counter intolerance rally

ఇటీవల ఇంటర్వ్యూలో షారుక్ ఇలా....
దేశంలో పెరిగిపోతున్న మత అసహనం మనల్ని చీకటి యుగానికి తీసుకెళుతుందని బాలీవుడ్‌ బాద్షా షారుక్‌ ఖాన్‌ ఇటీవల తన 50వ పుట్టినరోజు సందర్భంగా ఎన్‌డీటీవీ, ఇండియా టుడే చానెళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అసహన వాతావరణానికి నిరసనగా రచయితలు, శాస్త్రవేత్తలు అవార్డులు వెనక్కి ఇస్తుండటంపై స్పందిస్తూ.. తాను కూడా పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇచ్చేందుకు వెనకాడనని, అయితే, అలా చేయాల్సిన అవసరం లేదన్నారు.

దేశంలో తీవ్ర అసహనం ఉంది. ఇలా అసహనం ప్రదర్శించడం మూర్ఖత్వం. ఇది చాలా పెద్ద సమస్య. దేశభక్తి పేరుతో మత అసహనం, లౌకికవాదిగా ఉండకపోవడం అనేది నీచమైన నేరం. అసహనం ఏ రూపంలో ఉన్నా అది చెడ్డది. అది మనల్ని చీకటి యుగాలకు తీసుకెళుతుంది. మీరు ఒకవేళ దేశభక్తులైతే.. కొన్ని ప్రాంతాలు, మతాలను మాత్రమే కాదు.. దేశం మొత్తాన్నీ ప్రేమించాలి. అసహనాన్ని నిరసిస్తూ అవార్డులు వెనక్కి ఇచ్చేవారిని గౌరవిస్తున్నాను. కానీ నేను అలా చేయాల్సిన అవసరం లేదు. మాంసం తినే అలవాట్లను బట్టి మతాన్ని నిర్వచించరాదు. భావ ప్రకటన స్వేచ్ఛ గురించి నేనూ మాట్లాడొచ్చు. కానీ జనం నా ఇంటి ముందుకు వచ్చి రాళ్లేస్తారు'' అని షారుక్‌ తన జన్మదిన సందేశంలో చెప్పారు.

English summary
Section Of Film Industry Artists To Again Organise Counter Intolerance Rally. They will rally from Parliament House to Rashtrapati Bhawan and will submit a memorandum to the President against those who have announced ‘Award Wapsi’. Anupam Kher, Madhur Bhandarkar will also be a part of this rally.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu