»   » డా రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్ చిత్రానికి అవార్డులు...!

డా రామానాయుడు గారి సురేష్ ప్రొడక్షన్ చిత్రానికి అవార్డులు...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నిర్మాత డా డి రామానాయుడు భోజ్ పురి భాషలో సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై గోసంగి సుబ్బారావు దర్శకత్వంలో నిర్మించిన 'శివ" చిత్రానికి గాను బీహార్ రాష్ట్ర ప్రభుత్వ అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ కెమెరామెన్, ఉత్తమ సింగర్, ఉత్తమ పాటల రచయిత అవార్డులు సాధించింది. ఉత్తమ కెమెరామెన్ గా ఎస్ కె అమర్, ఉత్తమ సింగర్ గా ఉదిత్ నారాయణ ఎంపికయ్యారు. ఎస్ కె అమర్ పలు తెలుగు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసారు.

అలాగే హిందీలోనూ రెండు చిత్రాలకు, భోజ్ పురి లో రెండు చిత్రాలకు పనిచేసారు. ఆయన తెలుగులో పనిచేసిన పలు చిత్రాలు మంచి విజయాలు సాధించాయి. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన థమ్స్ అప్ యాడ్ కి కెమెరామెన్ గా, ఇంకా మణిశంకర్ దర్శకత్వంలో రూపొందించిన మరికొన్ని యాడ్స్ కి కెమెరామెన్ గా వ్యవహరించారు. 'పొలిటికల్ రౌడీ", పెళ్లాం కోసం, సలాం హైదరాబాద్, థ్రిల్లర్, అతడెవరు, ప్రేమసందడి" వంటి పలు చిత్రాలకు కెమెరామెన్ గా పనిచేసి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రముఖ కెమెరామెన్ జయరాం దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్ గా కెమెరామెన్ గా అమర్ పనిచేసారు...

English summary
Suresh Production Bhojpuri film "SHIVA" entered 4th week in mumbai & bihar too.The film is Produced by D.ramanaidu & written-directed by G.subba rao.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu