»   » "బాహుబలి" పై బ్రహ్మాస్త్రం: అయాన్ ముఖర్జీతో బాలీవుడ్ కొత్తప్రయోగం

"బాహుబలి" పై బ్రహ్మాస్త్రం: అయాన్ ముఖర్జీతో బాలీవుడ్ కొత్తప్రయోగం

Posted By:
Subscribe to Filmibeat Telugu
"బాహుబలి" పై బ్రహ్మాస్త్రం.. బాలీవుడ్ కొత్తప్రయోగం

"బాహుబలి" నిన్నామొన్నటి వరకూ టాలీవుడ్ అన్నా, తెలుగు సినీ నటులూ, దర్శకులూ అన్నా ఒక చిన్న చూపు ఉండేది బాలీవుడ్ లో. దర్శక ధీరుడు రాజమౌళి కొట్టిన దెబ్బతో ఒక్క సారి బాలీవుడ్ ఉలిక్కి పడింది, తెలుగు డబ్బింగ్ సినిమా వచ్చి ఏదో ఒక మామూలు హిట్ అయితే లైట్ తీసుకునే వాళ్ళేమో గానీ, రికార్డులని తుడిచి పెట్టి బాలీవుడ్ బ్లాక్బస్టర్స్ ని కూడా కిందకి నెట్టేసింది.

 బాహుబలిని మర్చిపోయేలా చేయాలని

బాహుబలిని మర్చిపోయేలా చేయాలని

ఎంత పైకి నవ్వుతూ మెచ్చుకుంటున్నా లోలోపల మాత్రం బాహుబలిని చూసి ఉడికి పోతూనే ఉన్నారు. ఒక్కటంటే ఒక్క సినిమాతీసి బాహుబలిని మర్చిపోయేలా చేయాలని తపిస్తూనే ఉన్నారు. బాలీవుడ్ దిగ్గజాలంతా ఎప్పటికప్పుడు బాహుబలి సినిమాలను బీట్ చేసే ధీటైన సినిమా ఒకటి చేయాలని వారు ప్రయత్నిస్తూనే ఉన్నారు.

 అయాన్ ముఖర్జీ

అయాన్ ముఖర్జీ

ఇప్పుడైతే ఏకంగా బాహుబలిని మార్కెటింగ్ చేసిన కరణ్‌ జోహార్ రంగంలోకి దిగాడు. వేకప్ సిడ్ మరియు ఏ జవానీ హై దివానీ వంటి సినిమాలను తీసిన అయాన్ ముఖర్జీ గుర్తున్నాడా? చిన్నతనంలోనే డైరక్టర్ అయిపోయిన ఈ కాజోల్ కజిన్.. ఇప్పుడు ఒక ఫాంటసీ సినిమాను రూపొందిస్తున్నాడు.

 బ్రహ్మాస్ర్త

బ్రహ్మాస్ర్త

సినిమా టైటిల్ ''బ్రహ్మాస్ర్త'' కాగా.. ఇది మూడు పార్టులుగా రిలీజ్ కానుంది. పైగా ఇందులో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్, ఆలియా భట్ వంటి స్టార్ క్యాస్టింగ్ అంతా ఉంది. నిన్ననే సినిమాను ప్రకటించిన కరణ్‌ జోహార్, ఆగస్టు 15, 2019న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు కూడా ప్రకటించాడు.

 ఫాక్స్ స్టార్ స్టూడియోస్ - నమిత్ మల్హోత్రా

ఫాక్స్ స్టార్ స్టూడియోస్ - నమిత్ మల్హోత్రా

విశేషమేంటంటే ఫస్ట్ పార్ట్ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసేశారు. 2019 ఆగస్టు 15 నాటికి మొదటి భాగాన్ని వెండితెరపై చూడవచ్చు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్ - నమిత్ మల్హోత్రాతో కలిసి ధర్మ ప్రొడక్షన్స్ అధినేత కరణ్ జోహార్ ఈ సినిమా నిర్మించబోతున్నారు. తమ సంస్థ అత్యంత ప్రతిష్ఠాత్మంగా ఈ సిరీస్ నిలుస్తుందని కరణ్ జోహార్ నమ్మకంగా ఉన్నాడు.

బాలీవుడ్ లో ఎవరూ చేయని ప్రయోగం

బాలీవుడ్ లో ఎవరూ చేయని ప్రయోగం

బాహుబలి హిందీ వెర్షన్ ను కరణ్ జోహారే రిలీజ్ చేశాడు. లార్జర్ దేన్ లైఫ్ క్యారెక్టర్లతో సినిమా తీస్తే ఏ రేంజిలో కలెక్షన్లు వస్తాయో ఈజీగా అర్ధమైనట్టుంది. అందుకే ఇంతవరకు బాలీవుడ్ లో ఎవరూ చేయని ప్రయోగాన్ని తలకెత్తుకున్నట్టున్నాడు. సాధారణంగా సినిమా ప్రారంభించేటప్పుడే రిలీజ్ డేట్ ఎప్పుడనేది హాలీవుడ్ లో చెప్పేస్తారు. స్క్రిప్టు విషయంలో వాళ్లంత పర్ ఫెక్ట్. ఇప్పుడు బ్రహ్మాస్త్రతో మొత్తం హాలీవుడ్ స్టయిల్ ని కరణ్ జోహార్ బాలీవుడ్ లో దింపేశాడు.

 అన్నీ లవ్ స్టోరీలే

అన్నీ లవ్ స్టోరీలే

అయితే ఇప్పటివరకు అయాన్ ముఖర్జీ యాక్షన్ ఎపిసోడ్లతో కూడిన ఒక్క సినిమాను కూడా తీయలేదు. అన్నీ కూడా లవ్ స్టోరీలే తీశాడు. అలా చూస్తే.. బాహుబలి వంటి మ్యాజిక్ ను రిపీట్ చేసి ఆ సినిమా రికార్డులు కొట్టేయడం ఈ పిల్లాడి వలన అవుతుందా? అన్న ప్రశ్న ఉన్నా ఖచ్చితంగా అయాన్ తో అలాంటి సినిమాని తీయాలన్న సంకల్పంతోనే పని చేస్తూ ఉన్నారు.

English summary
Yeh Jawani Hai Deewani director Ayan Mukerji’s upcoming film will be a fantasy adventure franchise starring Amitabh Bachchan, Ranbir Kapoor and Alia Bhatt. Titled Brahmastra, the film will be produced by Karan Johar’s Dharma Productions and presented by Fox Star Studios.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X