»   » అది లవ్ జిహాద్, నిన్ను చంపేస్తాం: టాలీవుడ్ హీరోయిన్ భర్తకి బెదిరింపులు

అది లవ్ జిహాద్, నిన్ను చంపేస్తాం: టాలీవుడ్ హీరోయిన్ భర్తకి బెదిరింపులు

Posted By:
Subscribe to Filmibeat Telugu

నటి ఆయేషా టకియా భర్తకు బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వచ్చాయి. గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి ఆయనను చంపేస్తామని బెదిరించారట.హిందూ మ‌త యువ‌తిని పెళ్లి చేసుకుని ల‌వ్ జిహాద్‌కు పాల్ప‌డినందుకు త‌నని చంపేస్తామ‌ని బెదిరింపు ఫోన్‌కాల్స్ వ‌చ్చిన‌ట్లు సినీ నటి అయేషా ట‌కియా భ‌ర్త ఫ‌ర్హాన్ అజ్మీ ముంబై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

ఫోన్ చేసిన వారు త‌మ‌ను తాము రాజ‌స్థాన్ హిందూ సేన పార్టీకి చెందిన వాళ్ల‌మ‌ని చెప్పిన‌ట్లు ఫ‌ర్హాన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే త‌న తండ్రి అబు అజ్మీని, ఒవైసీ కుటుంబాన్ని కూడా అంతం చేస్తామ‌ని ఫోన్ కాల‌ర్ బెదిరించిన‌ట్లు ఫ‌ర్హాన్ తెలిపారు. త‌ర‌చుగా మ‌తాల‌కు సంబంధించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసే ఫ‌ర్హాన్ తండ్రి, స‌మాజ్‌వాదీ పార్టీ నేత అబు అజ్మీ మీద కోపంతోనే ఫ‌ర్హాన్‌కు ఈ బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. త‌న మామ భావ‌జాలానికి ఆయేషా గానీ, ఫ‌ర్హాన్ గానీ ఎప్పుడూ మ‌ద్ద‌తు ప‌ల‌క‌లేదు. అయినా కూడా ల‌వ్ జిహాద్‌ నెపంతో బెదిరింపు కాల్స్ రావ‌డంతో ఫ‌ర్హాన్ ఆందోళ‌న‌కు గుర‌వుతున్నాడు

 Ayesha Takia’s Husband Receives Death Threat For Marrying Her

నాగార్జున హీరోగా వచ్చిన సూపర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది బబ్లీగర్ల్ ఆయేషా టకియా. తెలుగులో తీసింది ఒకే ఒక్క సినిమా అయినా ప్రేక్షకుల్లో మాత్రం గుర్తిండిపోయిందామె. బాలీవుడ్ ద్వారానే తెరంగేట్రం చేసిన ఆమె, తెలుగులోకి 2005లో ఎంట్రీ ఇచ్చింది. చివరిసారిగా 2013లో వచ్చిన ఆప్ కే లియే హమ్ అనే సినిమాలో కనిపించింది. ఇప్పుడామె పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి వెళ్లిపోయింది. సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) మహారాష్ట్ర యువజన శాఖ అధ్యక్షుడిగా కొనసాగుతున్న అబూ ఫర్హాన్ అజ్మీని పెళ్లి చేసుకుంది. వారికి ఓ పాప కూడా ఉంది.

English summary
Ayesha Takia‘s husband Farhan Azmi lodged a FIR against a Rajasthan Hindu activist group for receiving death threats.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu