»   »  పుట్టిన రోజు స్పెషల్: అఖిల్ అక్కినేని అరుదైన 'ఫొటోలు'

పుట్టిన రోజు స్పెషల్: అఖిల్ అక్కినేని అరుదైన 'ఫొటోలు'

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ :అక్కినేని నటవారసుడు అఖిల్ పుట్టిన రోజు నేడు. ఏడాది వయసులోనే సిసింధ్రీ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమైన అఖిల్ గత సంవత్సరం విడుదలైన మనం సినిమాలో అతిథి పాత్రలో కనిపించాడు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

తొలి చిత్రం విడుదల కాకముందే జాతీయ స్థాయి వాణిజ్య సంస్థల ప్రకటనలో నటించాడు అఖిల్. అమల, నాగార్జునలు అఖిల్‌ను మాస్ సినిమాతో పరిచయం చేయాలనుకోవటంతో ఆ భాద్యతలు డైనమిక్ డైరెక్టర్ వి.వి.వినాయక్‌కు అప్పగించారు.

టైటిల్ ఖరారు కాని ఈచిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ పతాకంపై నిఖిత రెడ్డి సమర్పణలో నితిన్ నిర్మిస్తున్నారు. ‘ప్రొడక్షన్ ఎ' గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయేషా సైగల్ అనే అమ్మాయిని హీరోయిన్ గా పరిచయం చేస్తున్నారు. ఈ చిత్రంలో అఖిల్ తండ్రి పాత్రలో ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ నటిస్తున్నట్లు సమాచారం.

పుట్టిన రోజు స్పెషల్ గా అఖిల్...అరుదైన ఫొటోలు ఇక్కడ స్లైడ్ షోలో

నాగార్జున ట్వీట్ చేస్తూ....

నాగార్జున ట్వీట్ చేస్తూ....

21వ పుట్టిన రోజు జరుపుకుంటు్న అఖిల్ కి నా శుభాకాంక్షలు.. మీ తాతగారు నిన్ను గైడ్ చేసి, ఆశీస్సులు అందచేస్తారని ఆశిస్తున్నాను

తండ్రి ఒడిలో సిసింద్రీ

తండ్రి ఒడిలో సిసింద్రీ

చిన్నప్పుడే తెరంగ్రేటం చేసిన సిసింద్రీ అఖిల్ ఇలా తన తండ్రి నాగార్జున ఒడిలో కూర్చుని క్యూట్ గా ఫోజిచ్చారు.

అఖిల్...పుట్టింది

అఖిల్...పుట్టింది

అక్కినేని అఖిల్... 1994, ఏప్రియల్ 8న పుట్టాడు. ఈ రోజు 21 వ పుట్టిన రోజు జరుపుకుంటన్నాడు

అల్లరి పిల్లవాడు

అల్లరి పిల్లవాడు

బయిట కనపడినప్పుడు అఖిల్ చాలా సిగ్గుగా ఉండే పిల్లవాడుగా కనిపిస్తాడు కానీ...నిజానికి స్కూల్ డేస్ లో చాలా అల్లరి పిల్లవాడు. ఇదిదో ఇదే సాక్ష్యం

పది నెలలు

పది నెలలు

పది నెలల వయస్సులోనే అఖిల్..ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించాడు. ఆ సినిమా సిసింద్రీ. శివ నాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందింది.

నానమ్మ సరసన

నానమ్మ సరసన

అఖిల్ కు తన నానమ్మ అంటే చాలా ఇష్టం. ఇదిగో అన్నపూర్ణ స్టూడియోస్ లో ఉన్న అన్నపూర్ణమ్మ గారి విగ్రహం ప్రక్కన కూర్చుని ఇలా..

కెమెరా వెనుక

కెమెరా వెనుక

అఖిల్ కేవలం నటుడు మాత్రమే కాదు 24 క్రాఫ్ట్ లలోనూ అతనికి ప్రవేశం ఉందని అందరూ అంటూంటారు.

అన్నదమ్ములు

అన్నదమ్ములు

అన్నదమ్ములు ఇద్దరూ ఎప్పుడూ అల్లరి చేస్తూ ఉంటారు. అఖిల్ ని చాలా ప్రేమగా చూసుకుంటూంటాడు నాగ చైతన్య.

పుట్టిన రోజు గిప్ట్

పుట్టిన రోజు గిప్ట్

అఖిల్ పుట్టిన రోజును పురస్కరించుకుని అఖిల్ తెరంగేట్రం చేస్తున్న చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ విడియో అందరి ప్రశంసలూ పొందుతోంది.

English summary
The Akkineni scion, Akhil Akkineni is celebrating his 21st birthday today. 21st birthday is indeed special for everyone for one's own reasons. Celebrating the joy of the day, let us cherish the wonderful moments by checking out these adorable and rare pictures of Akhil Akkineni.
Please Wait while comments are loading...