»   » బాలీవుడ్ సింగర్ షాన్‌ పాట ఇట్స్ మై లైఫ్

బాలీవుడ్ సింగర్ షాన్‌ పాట ఇట్స్ మై లైఫ్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Shaan
హైదరాబాద్ : ప్రముఖ బాలీవుడ్ గాయకుడు షాన్ తెలుగులో రూపొందుతున్న 'ఇట్స్ మై లైఫ్' చిత్రానికి పాట పాడబోతున్నారు. యశస్విని రీల్స్ పతాకంపై బేబి తన్విశ్రీ సమర్పణలో ఎస్.ఎస్.నాయుడు ఈ చిత్ర నిర్మిస్తున్నారు. నూతన తారలు, సీనియర్ నటులతో రూపొందుతున్న ఈ చిత్రానికి రామినేని నేతాజీ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.ఆర్.శంకర్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో మరో పాటను ప్రముఖ గాయకుడు బాబా సెహగల్ ఆలపించారు.

సినిమా గురించి దర్శకుడు రామినేని నేతాజీ చిత్ర మాట్లాడుతూ ''సంగీతానికి ప్రాధాన్యం వున్న చిత్రం కావడం వల్ల ఇందులోని పాటలను ప్రఖ్యాత గాయనీ గాయకులతో పాడిస్తున్నాం. పాటలతో పాటు షూటింగ్ మొత్తం పూర్తయింది. నేటి యువత అనేక ఆంక్షల మధ్య పెరిగి పెద్దవుతూ, తమ ఆకాంక్షలకు అనుగుణంగా తమ జీవితాలను మలుచుకోలేకపోతున్నారు.

ముఖ్యంగా ప్రస్తుత మన విద్యావ్యవస్థ నేటి యువతరాన్ని పలు అవస్థల పాలుజేస్తున్నది. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని రూపొందిస్తున్న వినోదాత్మక చిత్రమిది. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను త్వరలోనే విడుదల చేస్తాం. బాబా సెహగల్, షాన్ ఆలపించిన పాటలు ఈ చిత్రానికి హైలైట్‌గా నిలుస్తాయి''అని చెప్పారు.

ఈ చిత్రానికి ఆర్ట్: భాస్కర్, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, కెమెరా: ఎన్.సుధాకర్‌రెడ్డి, మాటలు: కొప్పెర కిరణ్‌కుమార్, లిరిక్స్ : అశోక్‌తేజ, చంద్రబోస్, సంగీతం: ఎస్.ఆర్.శంకర్, సహ నిర్మాత: ఎం.కె. రావు, నిర్మాణ సారథ్యం: శివకుమార్.వి, నిర్మాత: ఎస్.ఎస్.నాయుడు, రచన-దర్శకత్వం: రామినేని నేతాజీ.

English summary
Bollywood singer Shaan sings for youthful and thoughtful entertainer 'It's My Life'. The movie produced by S.S.Naidu, Ramineni Netaji is the director. Baba Sehgal sung another song in this movie. S.R.Shankar is Composing the music.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu