twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టార్గెట్ యూఎస్ : సెంచరీ క్రాసైన ‘బాద్‌షా’ ప్రీమియర్ షోలు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్ : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్‌కు ఏపీ సినిమా మార్కెట్‌పై మంచి పట్టుంది. నైజాం, సీడెడ్, ఆంధ్ర తదితర టెర్రీటరీల్లో ఆయన సినిమాలకు వసూళ్ల పంటే. అయితే ఓవర్సీస్‌లో మార్కెట్‌లో, ముఖ్యంగా అమెరికా బాక్సాఫీసు వద్ద ఎన్టీఆర్ జోరు తక్కువనే చెప్పాలి. ఇతర హీరోల సినిమాలతో పోలిస్తే ఇప్పటి వరకు ఎన్టీఆర్ సినిమాల అక్కడ గడించిన లాభాలు తక్కువే.

    ఇప్పటి వరకు యూఎస్ మార్కెట్‌ను నిర్లక్ష్యం చేసిన ఎన్టీఆర్...'బాద్ షా' చిత్రంతో తన సత్తా చాటడానికి సిద్ధం అయ్యారు. ఇక్కడ ఈ సినిమా రికార్డు స్థాయిలో విడుదలవబోతోంది. యూఎస్ వ్యాప్తంగా ఈచిత్రం దాదాపు 120 స్క్రీన్లలో విడుదలవుతోంది. ఒక తెలుగు సినిమాకు ఇన్ని స్క్రీన్లు కేటాయించడం అంటే రికార్డు స్థాయి అనే చెప్పాలి.

    యూఎస్‌లో బాద్ షా చిత్రం ఒక రోజు ముందుగానే (ఏప్రిల్ 4) విడుదలవుతోంది. భారీ సంఖ్యలో ఇక్కడ ప్రీమియర్ షోలు ప్రదర్శిస్తున్నారు. బాద్ షా హిట్టయితే యూఎస్ బాక్సాఫీసు మార్కెట్లో ఎన్టీఆర్ నెం.1 పొజిషన్‌ దక్కించుకోవడం ఖాయం అంటున్నారు.

    'బాద్ షా' చిత్రాన్ని బండ్ల గణేష్ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఎన్టీఆర్ సరసన కాజల్ అగర్వాల్ నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు శ్రీను వైట్ల 'బాద్ షా' చిత్రాన్ని ఫుల్లీలోడెడ్ ఎంటర్ టైన్మెంట్స్ ఎలిమెంట్స్ తో రూపొందించారు. ఈ చిత్రానికి థమన్, కె.వి.గుహన్, గోపీమోహన్, కోనవెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎంఆర్ వర్మ, చలసాని రామారావు సాంకేతిక వర్గం. సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీను వైట్ల.

    English summary
    ‘Baadshah’ is generating tremendous buzz in the US and the film is getting approximately 120 screens for the opening weekend. Check out Baadsha USA Premiere Schedules.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X