twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్: 'బాద్‌షా' ఆడియో రిలీజ్ వాయిదా

    By Srikanya
    |

    హైదరాబాద్: ఎన్టీఆర్, శ్రీను వైట్ల కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ కామెడీ 'బాద్ షా' ఆడియోని మార్చి 10న గ్రాండ్ గా విడుదల చేస్తున్నట్లు నిర్మాత బండ్ల గణేష్ ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడా విడుదల తేదీ మారనుంది. చివరి నిముషంలో పంక్షన్ కు పోలీస్ పర్మిషన్ దొరకలేదు. హైదరాబాద్ లో బాంబ్ బ్లాస్ట్ లు జరిగిన నేపధ్యంలో ఈ చిత్రం ఆడియో ని ప్రస్తుతం వాయిదా వేయమన్నట్లు డిజెపి కోరినట్లు సమాచారం. శివరాత్రి పండుగ రోజున ఈ పంక్షన్ కి రాష్ట్రం నలుమూలలనుంచి అభిమానులు వస్తూండటంతో, ఏదైనా ప్రమాదం జరిగే అవకాసం ఉందని పోలీసులు హెచ్చరించి వాయిదా కోరినట్లు తెలుస్తోంది.

    భధ్రతా కారణాల దృష్ట్యా వాయిదా పడటంతో బండ్ల గణేష్ నిరాసపడినప్పటికి మార్చి 17న ఈ ఆడియోని ఘనంగా చేయాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్రం షూటింగ్ దాదాపు ముగింపు దసకు వచ్చింది. మార్చ్‌లో లాంచ్ చేయబడ్డ ఈ చిత్రం శ్రీను వైట్ల దర్శకత్వంలో శ్రీ పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పతాకంపై బండ్ల గణేష్ నిర్మిస్తున్నారు.

    బండ్ల గణేష్ మాట్లాడుతూ... ''అభిమానుల నడుమ సందడిగా గీతావిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఏప్రిల్‌ 5న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలో నవదీప్‌ కీ రోల్ చేసారు. ఎన్టీఆర్, కాజల్‌లతో పాటు తెలుగు, తమిళ, హిందీ రంగాలకు చెందిన 50మందికి పైగా ప్రముఖ నటీనటులు ఇందులో నటిస్తున్నారు . ఆసక్తిగొలిపే కథ, కథనాలతో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులోని యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ ప్రేక్షకుల్ని అద్భుతంగా ఎంటర్‌టైన్ చేస్తాయి. 'బాద్‌షా'గా ఓ కొత్త ఎన్టీఆర్‌ని చూస్తారు.

    అలాగే.. ఎన్టీఆర్‌ సినిమా అంటే మాస్‌, యాక్షన్‌ల కలబోత. వీటితోపాటు వినోదం కూడా తోడై వస్తే అది శ్రీను వైట్ల శైలి. ఇప్పుడు వీరిద్దరి కలయికలో వస్తున్న 'బాద్‌షా'లో ఇవన్నీ మేళవించామంటున్నారు బండ్ల గణేష్‌. ఆయన నిర్మిస్తున్న చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం పూర్తి కామెడీతో అలరిస్తుందని చెప్తున్నారు.

    English summary
    NTR fans have been waiting for the audio launch ceremony of Baadshah on March 10th. Even preparations for the event were underway. And in the last minute, the producers get shocker from Hyderabad Police. They refused to give the permission to hold audio launch in Hyderabad on March 10th, as the day is Maha Shivarathri, an auspicious festival. In the wake of recent bomb blasts in Dilshuknagar area in Hyderabad, police refused to give permission to conduct a function on the festival day as it attracts huge turnout of fans from all over the state.Probably it would be held on March 17th.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X