twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాద్‌షా’ సెన్సార్ కట్స్ ఏమేంటి?

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'బాద్‌షా' సెన్సార్‌ పూర్తిచేసుకుని యు/ఎ సర్టిఫికెట్‌ పొందింది. ఈ చిత్రాన్ని చూసి సెన్సార్‌ సభ్యులు అద్భుతంగా ఉందని ప్రసంసించారని నిర్మాత బండ్ల గణేష్‌ తెలిపారు. 'ఈ సమ్మర్‌లో బాద్‌షా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అవుతుందన్న నా నమ్మకం రెట్టింపయ్యింది. ఏప్రిల్‌ 5న ఉదయం 5.09 ని.లకు 'బాద్‌షా' ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సెంటర్లలో రిలీజ్‌ కానుంది' అన్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రంలో వేటికి సెన్సార్ కట్స్ చెప్పారనే ఆసక్తి అందరిలో కలుగుతోంది.

    ఈ చిత్రం లో పెద్దగా సెన్సార్ కట్స్ పడ్డ సీన్స్ ఏమీ లేవు. కేవలం బొంగు,బలుపు,బొక్క,నీ అబ్బ వంటి పదాలకు 4-5 చోట్ల బీప్ శబ్దం పడింది. అలాగే వెలకం కనకం సాంగ్ లో కలకండ పదానికి అభ్యంతరం చెప్పారని తెలిసింది. ఇక స్మోకింగ్ సీన్స్ కు క్రింద హెచ్చరిక షరా మామూలే. అయితే ఇంటర్వెల్ వద్ద బాద్షా రివిల్ అయ్యే సన్నివేసంలో వయిలెన్స్ ఎక్కువైందని ఈ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చారని సమాచారం. అప్పటికీ శ్రీనువైట్ల క్లీన్ యు సర్టిఫికేట్ కోసం పోరాడారని కానీ కుదరలేదని అంటున్నారు.

    సక్సెస్‌ అవ్వాలంటే భయం ముఖ్యం. ఆ భయం శ్రీనువైట్లలో ఉంది. అందుకే వరుస విజయాలతో అగ్రదర్శకుల్లో ఒకరిగా నిలిచారాయన'' అన్నారు ఎన్టీఆర్‌. ఆయన కథానాయకుడిగా నటించిన చిత్రం 'బాద్‌షా'. కాజల్‌ కథానాయిక. శ్రీనువైట్ల దర్శకుడు. పరమేశ్వర ఆర్ట్‌‌స పతాకంపై బండ్ల గణేష్‌ నిర్మిస్తున్నారు. శివబాబు సమర్పకుడు. తమన్‌ స్వరాలు హెక్సాప్లాటినం డిస్క్‌ అందుకున్న సందర్భంగా హైదరాబాద్‌లో

    ఎన్టీఆర్‌ మాట్లాడుతూ..-'' నా 13ఏళ్ల కెరీర్‌లో అన్ని సినిమాలు ఓ ఎత్తు. ఈ సినిమా మరో ఎత్తు. డ్రస్సింగ్‌ నుంచి హెయిర్‌ స్టైల్‌, కనుచూపు..ప్రతిదీ తనే శాసించాడు వైట్ల. నేను ఇంత స్టైలిష్‌గా కనిపించడానికి కారణం ఆయనే. శ్రీను చేసిన సినిమాల న్నీ దాదాపు హిట్లే. ప్రతి సినిమాని సక్సెస్‌ చేయాలనే భయం తనలో ఉంటుంది. అందుకే ఇవాళ అగ్రదర్శకుల్లో ఒకరిగా నిలిచారు. గణేష్‌ తక్కువ సమయంలో అగ్రనిర్మాతగా ఎదిగారు. బ్లాక్‌బస్టర్‌ కోసం పదే పదే తపిస్తారాయన. ఇలాంటి ఓ చిత్రం తీయాలంటే నిర్మాతకు దమ్ము, ధైర్యం ఉండాలి. అవి రెండూ గణేష్‌లో ఉన్నాయి. తమన్‌ నా డాన్సులను దృష్టిలో పెట్టుకుని చక్కని సంగీతం అందించారు'' అన్నారు.

    శ్రీనువైట్ల మాట్లాడుతూ-''నటుడిగా ఎంతో కష్టపడ్డ గణేష్‌ తపనతో నిర్మాతగా ఎదిగాడు. బ్లాక్‌ బస్టర్‌ కావాలని అడిగా రాయన. దాంతో కోన, గోపిలతో కలిసి స్క్రిప్టుప నులు ప్రారంభించాను. ఎన్టీఆర్‌ నాకంటే సీనియర్‌. అయినా అన్నిరకాల సహకరిం చారు '' అన్నారు. బండ్ల గణేష్‌ మాట్లా డుతూ- ''ఎన్టీఆర్‌ కెరీర్‌కి గొప్ప బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని వ్వాలని ఈ చిత్రం చేశాను. శ్రీనువైట్ల తో మరో సినిమా చేస్తాను'' అన్నారు.

    English summary
    NTR Starrer Baadshah has completed the censor formalities and is gearing up worldwide release on 5th April 2013 . The movie has been cleared by censor board with U/A certificate with 4-5 minor beeps - bongu, balupu , bokka , nee abba etc., Sreenu Vytla has fought hard for the clean U Certificate and though there is no vulgarity in the movie and it is clean overall – the welcome kanakam song [ with words like "Kalakanda ] , and the smoking and boozing scenes , violence in the interval bang where the Baadshah character is revealed might have just prompted the censor board to go with U/A certificate [ above 12 years of age with Parental Guidance ] .
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X