For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ఎన్టీఆర్‌ 'బాద్‌ షా' సెన్సార్ క్లియర్

  By Srikanya
  |

  హైదరాబాద్: ఎన్టీఆర్‌ హీరోగా నటించిన చిత్రం 'బాద్‌ షా'. కాజల్‌ హీరోయిన్. శ్రీనువైట్ల దర్శకత్వం వహించారు. బండ్ల గణేష్‌ నిర్మాత. తమన్‌ స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రం సెన్సార్ ఫార్మాలిటీస్ ఈ రోజు క్లియర్ అయ్యాయి. చిత్రానికి U/A సర్టిఫికేట్ ఇచ్చారు. ఏప్రియల్ 5న గ్రాండ్ గా విడుదల అవుతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి.

  ఈ చిత్రాన్ని కేవలం ఆంధ్రాలోనే వెయ్యికు పైగా థియోటర్స్ లో విడుదల చేస్తున్నారు. అలాగే యుఎస్ లో110 థియోటర్స్ వో విడదల చేస్తున్నారు. ఈ చిత్రానికి మహేష్ బాబు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. బ్రహ్మానందం, ఎమ్.ఎస్ నారాయణ ఈ చిత్రంలో నవ్వించే భాధ్యతను తీసుకోగా... నవదీప్ విలన్ గా కనిపిస్తారు. సిద్దార్ద... ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు సోదరడుగా కనిపించనున్నారు.

  ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ''నేను పరిశ్రమకు వచ్చి నవంబర్‌తో పదమూడు సంవత్సరాలు అవుతుంది. ఈ మొత్తం పదమూడేళ్ల ప్రయాణాన్ని 'బాద్‌ షా' గుర్తు చేసింది. నేను వేసుకొన్న దుస్తులు, చెప్పులు, వాచీ ప్రతి ఒక్కటీ దగ్గరుండి చూసుకొన్నాడు శ్రీనువైట్ల. 'బాద్‌ షా'లో ఎన్టీఆర్‌ బాగున్నాడు అని పరిశ్రమ అంటే ఆ క్రెడిట్‌ అంతా శ్రీనువైట్లదే. విజయం పట్ల భయం ఉండాలి. అప్పుడే అది మళ్లీ మళ్లీ వరిస్తుంటుంది. అలా భయంతో పనిచేసే దర్శకుడు శ్రీను. అంతా మనదే... మనమే దేవుళ్లు అనుకొంటే ఆ రోజే మన పతనం మొదలవుతుంది. అది శ్రీనువైట్లలో ఏ కోశానా కనిపించదు. నటుడిగా నాకు బండ్ల గణేష్‌తో పెద్దగా పరిచయం లేదు. 'ఆంధ్రావాలా'లో చిన్న పాత్ర చేశాడంతే. తను నిర్మాత అవుతాడని అస్సలు అనుకోలేదు. ఒకవేళ నిర్మాత అయినా ఇలా అగ్ర నిర్మాతగా మారతాడని ఊహించలేదు. ఇంత పెద్ద సినిమా తీయాలంటే దమ్ముండాలి. అది ఉన్న నిర్మాత బండ్ల గణేష్‌. మణిశర్మ దగ్గర కీబోర్డ్‌ ప్లేయర్‌గా ఉన్నప్పుడు తమన్‌ని చూశాను. తను చేసిన 'కిక్‌' పాటలు నా కారులో నా బెడ్‌ రూమ్‌లో ఎక్కడ చూసినా వినిపించేవి. ఇందులో నా నృత్యరీతులకు తగినట్టుగా బాణీలిచ్చాడు'' అన్నారు.

  శ్రీను వైట్ల మాట్లాడుతూ ''ఎన్టీఆర్‌తో సినిమా అనగానే చాలా కథలు అనుకొన్నాం. కాకపోతే ఒక మంచి సినిమా తీయాలనే ఉద్దేశంతో కథపై మరింత కసరత్తు చేశాం. షూటింగ్‌ రేపనగా కూడా కథకు మెరుగులు దిద్దుతూనే ఉన్నాం. తారక్‌ నా కంటే సీనియర్‌. నాకంటే ఎక్కువ సినిమాలు చేశాడు. కానీ ఎప్పుడూ అలా, ఇలా అని చెప్పలేదు. నాకేం కావాలో ఎలా కావాలో అడిగి మరీ చేశాడు. సినిమా ఇలా రావడానికి కారణం తారక్‌. ఎన్టీఆర్‌ని ఎంత కష్టపెట్టినా అది అభిమానుల్ని సంతృప్తిపరచడానికే. ఈ సినిమాకి ముందు తారక్‌ అభిమానులతో మాట్లాడాను. వాళ్లెప్పుడూ డ్యాన్స్‌లు అదిరిపోవాలని చెప్పేవాళ్లు. అది గుర్తుపెట్టుకొని డ్యాన్స్‌లపై ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొన్నాం. ఒక పాటకోసం రిహార్సల్స్‌ కావాలి, చేస్తానన్నాడు కానీ చివరి నిమిషం వరకు చేయలేదు. ఏకంగా సెట్‌లో స్టెప్పులు వేసి అబ్బురపరిచాడు. తారక్‌కి నాట్యం దేవుడిచ్చిన వరమని ఆ రోజే అనిపించింది'' అన్నారు.

  English summary
  NTR, Kajal starrer Badshah which went to censor today completed its censor formalities. Censor Board members after watching the film gave U/A certificate for the film thus clearing decks for its grand release across the world on 5th April. Srinu Vytla directed the film produced by Bandla Ganesh on Parameswara Arts banner. Film makers are planning to release the film in over 1000 theaters in AP along and in around 110 theaters in US alone.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X