twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చికెన్, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: 'బాద్ షా' చిత్రం తనకు ఎంత సంతృప్తిని ఇచ్చింది కాస్త వెరైటీగా వివరించి చెప్పారు యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్. ఆదివారం జరిగిన 'బాద్ షా' హెక్సా ప్లాటినమ్ డిస్క్ వేడుకలో ఆయన మాట్లాడుతూ...''నాకు చికెన్ పులుసు, గారెలు అంటే ఇష్టం. అమ్మచేత్తో తినడం చాలా ఇష్టం. అదే విధంగా మొదటి సినిమా విజయం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అదే విధంగా మంచి మిత్రుడు కలిసినప్పుడు ఆ ఆనందమే వేరు.

    కానీ ఈ ఆనందాలన్నింటినీ 'బాద్ షా' చిత్రం మరిపించ చేసింది. ఇండస్ట్రీలో ఇన్నాళ్లు పడ్డ కష్టాన్ని మరోసారి గుర్తు చేసింది. అంటే ఇన్ని సినిమాలు ఓ ఎత్తు..బాద్ షా సినిమా మరో ఎత్తు. డ్రస్సింగ్, హెయిర్ స్టైల్, కను చూపు ఎలా చూడాలన్న విషయం దగ్గర నుంచి దర్శకుడు శ్రీను వైట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు. నన్ను ఎంతో స్టైలిష్ గా చూపించాడు. తను చేసిన ప్రతి సినిమా సక్సెస్ చేయాలనే భయంతో కష్ట పడి పని చేస్తుంటారు. అందుకే ఆయన ఈ రోజు అగ్రదర్శకుల్లో నిలిచారు.

    ఇలాంటి సినిమా చేయడానికి నిర్మాతకు దమ్ము, దైర్యం కావాలి. అవి రెండూ ఉన్న నిర్మాత గణేష్. తమన్ 'కిక్' పాటలు విన్నప్పుడే అతని మ్యూజిక్ పై నమ్మకం ఏర్పడింది. బృందావనానికి పని చేసాడు. ఈ సినిమాలో నా డాన్సులకు సరిపోయేలా బాగా మ్యూజిక్ కంపోజ్ చేసాడు'' అని చెప్పుకొచ్చారు ఎన్టీఆర్.

    మిగతా వివరాలు స్లైడ్ షోలో...

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    శ్రీను వైట్ల మాట్లాడుతూ సినిమాల్లో జూ ఎన్టీఆర్ నాకన్నా సీనియర్. కానీ నేను ఏం చెప్పినా చేసారు. డాన్సులు ఇరగదీసాడు. అభిమానులకు అంచనాలను మించి పోతుంది. సినిమాలో ప్రతీదీ హైలెటే అన్నారు.

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    ముఖ్య అతిథిగా వచ్చేసిన వినాయక్ మాట్లాడుతూ..పాటలు బాగా పెద్ద హిట్టయ్యాయి. సినిమాలో తారక్ గెటప్, స్టైల్ కొత్తగా ఉన్నాయి. దూకుడు కంటే ‘బాద్ షా' పెద్ద హిట్ట అవుతుంది అన్నారు.

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    బండ్ల గణేష్ మాట్లాడుతూ.. సంకల్పంతో, కసితో, పట్టుదలతో ఈ సినిమా చేసాను. ఎన్టీఆర్ కెరీర్లో బాద్ షా గొప్ప సినిమాగా నిలవాలని చేసాను. శ్రీను వైట్లతో సినిమా చేసి ఉండకపోతే నేను లైఫ్ లో చాలా మిస్సయి ఉండే వాడిని.

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    తమన్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ తో ఇది రెండో సినిమా. కంపోజర్ గా 200 శాతం సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది. శ్రీను వైట్ల, బండ్ల గణేష్ లతో కూడా పని చేయడం ఇది రెండో సారి అన్నారు.

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    ఈ కార్యక్రమానికి కెఎస్ రామారావు, కె.ఎల్ నారాయణ, రామజోగయ్య శాస్త్రి, భాస్కర భట్ల, కృష్ణ చైతన్య, దిల్ రాజు, వంశీ పైడిపల్లి, బెల్లంకొండ, సంతోష్ శ్రీనివాస్, కొరటాల శివ, హరీష్ శంకర్ తదితరులు హాజరయ్యారు.

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    ఈ చిత్రానికి సంగీతం: థమన్ ఎస్.ఎస్, మాటలు: కోనా వెంకట్, గోపీమోహన్, కెమెరా: ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్: ఎం.ఆర్.వర్మ, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీనువైట్ల.

    చికెను, గారెలు... బాద్‌ షా: పోల్చిన ఎన్టీఆర్ (ఫోటో ఫీచర్)

    ఏప్రిల్ 5న బాద్ షా చిత్రం విడులవుతోంది.

    English summary
    Baadshah team has celebrated the Hexa platinum disc function yester day at Daspalla Hotel, Hyderabad. Jr NTR looked very stylish in black shirt and he was accompanied by director Seenu Vaitla and music director SS Thaman.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X