»   » హీరోయిన్ ఇలియానా షాకింగ్ లుక్, మరీ ఇంత కఠినంగానా? (ఫోటోస్)

హీరోయిన్ ఇలియానా షాకింగ్ లుక్, మరీ ఇంత కఠినంగానా? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: హీరోయిన్ ఇలియానాకు అందం పరంగా మంచి పేరుంది. ఆమె చిట్టినడుముకు లెక్కలేనంత మంది అభిమానులు. అయితే బాలీవుడ్ మూవీ 'బాద్‌షాహో' చిత్రంలో ఇల్లీ బేబీ డీగ్లామరస్ పాత్రలో కనిపించబోతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు.

ఈ చిత్రంలో ఇప్పటి వరకు చేయని ఓ డిఫరెంట్ పాత్రలో నటిస్తోంది ఈ గోవాబ్యూటీ. ఆమె లుక్ చూస్తుంటే కఠినమైన మనస్తత్వం ఉన్న అన్ కాంప్రమైజ్డ్, టఫ్ పర్సన్‌గా కనిపించబోతోందని తెలుస్తోంది.

ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్

ఇలియానా ఫస్ట్ లుక్ పోస్టర్

‘బాద్‌షాహో' చిత్రానికి సంబంధించి ఇలియానా ఫస్ట్ లుక్ ఇదే. సినిమా వివరాల్లోకి వెళితే... దీవార్, వన్స్ అపాన్ ఎ టైమ్ ఇన్ ముంబై, ది డర్టీ పిక్చర్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మిలన్ లుథ్రియా దర్శకత్వం వహిస్తున్నారు.

ఆరుగురు వ్యక్తుల చుట్టూ...

ఆరుగురు వ్యక్తుల చుట్టూ...

‘బాద్‌షాహో' చిత్రం 6 గురు వ్యక్తుల చుట్టూ తిరుగుతుంది. ఈ ఆరు పాత్రల్లో అజయ్ దేవగన్, ఇమ్రాన్ హష్మి, ఇలియానా, విధ్యుత్ జామ్‌వాల్, ఇషా గుప్తా, సంజయ్ మిశ్రా నటిస్తున్నారు.

1975 ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్‌తో

1975 ఎమర్జెన్సీ బ్యాక్ డ్రాప్‌తో

1975 ఎమర్జెన్సీ కాలంనాటి సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఆ సమయంలో ఓ ట్రక్కులో కోట్లాది రూపాయల విలువైన బంగారం తలించారని, 600 కిలోమాటర్లు 96 గంటపాటు జరిగే ఈ ప్రాయాణంలో ఏం జరిగింది? ఈ ఆరుగురు వ్యక్తులకు సంబంధం ఏమిటనే కాన్సెప్టుతో సినిమా తెరకెక్కుతోంది.

రిలీజ్ డేట్

రిలీజ్ డేట్

సెప్టెంబర్ 1న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి అంకిత్ తివారీ సంగీతం అందిస్తున్నారు. ఆసక్తికరమైన స్క్రీన్ ప్లేతో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులకు అద్దంపట్టేలా సినిమా ఉంటుందని అంటున్నారు.

English summary
The makers unveiled a new poster of Baadshaho featuring Ileana D'Cruz. In the poster, the pretty lady is seen wearing a golden saree and teamed it up with pearled jewellery.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu