»   » చిరంజీవి లైఫ్ టైం రికార్డ్ ఒక్కరోజులో బద్దలైంది: బాహుబలి దెబ్బ గట్టిగానే పడింది

చిరంజీవి లైఫ్ టైం రికార్డ్ ఒక్కరోజులో బద్దలైంది: బాహుబలి దెబ్బ గట్టిగానే పడింది

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి... గతరెండేళ్ళు గా ఎదురు చూస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ సినిమా ఈ రోజు దేశం మొత్తం మారు మోగిపోతోంది. ఇంతవరకూ భారతీయ సినీ చరిత్ర లోనే ఏ సినిమా విషయం లో జరగనంత చర్చ ఈ సినిమా పై జరుగుతోంది. ఇంత సెన్సేషన్ క్రియేట్ అవుతుందని జక్కన్న కి ఎప్పుడో తెలుసు గనకే ఇప్పటి వరకూ కనీ వినీ ఎరుగని టార్గెట్ 1000 కోట్ల మీద మీద పెట్టాడు.

నాన్ బాహుబలి రికార్డ్

నాన్ బాహుబలి రికార్డ్

అసలు బాహుబలి పార్ట్ వన్ పెట్టిన టార్గెట్టే ఒక దశలో మైలు రాయిగా నిలబడింది. అప్పటినుంచే "నాన్ బాహుబలి రికార్డ్" అనే పదమూ పుట్టింది. అయితే ఇంత హైప్ తెచ్చి న సినిమా ఇప్పుడు ఎంత వసూలు చేసి ఉండొచ్చు అని చూస్తే మాత్రం ఒక్క రోజు కూడా గడవక ముందే కళ్ళు బైర్లు కమ్మటం ఖాయం.... ఇంతకీ ఆ మొత్తం ఎంతో తెలుసా????


స్టార్‌ మా టీవీ

స్టార్‌ మా టీవీ

ఇక సినిమా హక్కులను రెండు పార్ట్ లూ కలిపి 28 కోట్ల రూపాయలకు ‘స్టార్‌ మా' టీవీ కి అమ్మేశారు. ఈ లెక్కన రెండో భాగానికి 14 కోట్ల రూపాయలు దక్కింది. దీంతో అవుట్‌ రైట్‌ అమ్మకాలు, తీసుకున్న అడ్వాన్సులు, శాటిలైట్‌ రైట్ల లెక్కల ప్రకారం చూస్తే.175 కోట్ల రూపాయలు

175 కోట్ల రూపాయలు

'బాహుబలి-2: ద కన్ క్లూజన్' తెలుగు వెర్షన్ ఒక్కదానికే 175 కోట్ల రూపాయలు వసూలైనట్టు తెలుస్తోంది. మలయాళం హక్కులను 6 కోట్ల రూపాయల నుంచి 10 కోట్ల రూపాయల మధ్యలో అమ్మగా, తమిళ, హిందీ వెర్షన్‌ లను కూడా భారీ ఎత్తున అమ్మినట్టు తెలుస్తోంది. ఈ లెక్కని ఈ సినిమా విడుదలకు ముందే వందల కోట్ల రూపాయల వ్యాపారం చేసినట్టే.


ఖైదీ నెంబర్ 150

ఖైదీ నెంబర్ 150

ఇటీవల విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి సినిమా ‘ఖైదీ నెంబర్ 150' ఓవరాల్ కలెక్షన్లను ప్రీ బుకింగ్స్‌తోనే బాహుబలి-2 కొల్లగొట్టింది. అమెరికాలో ఖైదీ నెంబర్ 150 సినిమా 2.45 మిలియన్ డాలర్లు (15 కోట్ల 70 లక్షల రూపాయలు) కలెక్ట్ చేసింది.


3 మిలియన్ డాలర్లా..!?

3 మిలియన్ డాలర్లా..!?

అయితే బాహుబలి-2 సినిమా అమెరికాలో ఇప్పటికే ప్రీ బుకింగ్స్ ద్వారా ఏకంగా 3 మిలియన్ డాలర్లను (దాదాపు 19 కోట్ల రూపాయలు) కలెక్ట్ చేసిందని అక్కడ ఈ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తున్న గ్రేట్ ఇండియన్ ఫిల్మ్స్ సంస్థ ప్రకటించింది. అమెరికాలో గంటలకు 64 లక్షల రూపాయల విలువ చేసే టికెట్స్ బుక్ అవుతున్నాయనీ తెలిపారు.


ఎప్పుడూ లేనంతగా

ఎప్పుడూ లేనంతగా

గతంలో ఎప్పుడూ లేనంతగా రికార్డు స్థాయిలో అమెరికాలో బాహుబలి-2 విడుదల అవుతుండటంతో ఈ కలెక్షన్లు మరింతగా దూసుకెళ్లే అవకాశం ఉంది. అమెరికా మొత్తం మీద విడుదలవుతున్న అన్ని భాషల్లో కలిపి 1100 స్క్రీన్లలో బాహుబలి-2 సందడి చేయనుంది.


ప్రతి గంటకూ లక్ష డాలర్లు

ప్రతి గంటకూ లక్ష డాలర్లు

కొన్ని గంటల కిందట ఆ సంస్థ విడుదల చేసిన ప్రకటన ప్రకారం బాహుబలి అన్ని వెర్షన్లకు కలిపి ఇప్పటిదాకా జరిగిన ప్రి రిలీజ్ బుకింగ్స్ ప్రకారం వసూళ్లు 3 మిలియన్ డాలర్లను దాటిపోయాయి. ప్రతి గంటకూ లక్ష డాలర్ల దాకా వసూళ్లు జమ అవుతున్నట్లుగా గ్రేట్ ఇండియన్ ఫిలిమ్స్ సంస్థే పేర్కొంది.


దాదాపు 1100 స్క్రీన్లలో

దాదాపు 1100 స్క్రీన్లలో

ఈ లెక్కన చూస్తుంటే ప్రిమియర్లతోనే బాహుబలి-2 నాలుగు, ఐదు మిలియన్ డాలర్ల మధ్య వసూలు చేసేలా కనిపిస్తోంది. వీకెండ్ అయ్యేసరికే 10 మిలియన్ మార్కును అందుకున్నా ఆశ్చర్యం లేదేమో. అమెరికా, కెనడాల్లో కలిపి బాహుబలి-2 దాదాపు 1100 స్క్రీన్లలో రిలీజవుతుండటం విశేషం.


టికెట్ ధర దాదాపు 40 డాలర్లు

టికెట్ ధర దాదాపు 40 డాలర్లు

ఈ చిత్రానికి ఉన్న డిమాండ్ దృష్ట్యా ప్రిమియర్స్ టికెట్ ధర దాదాపు 40 డాలర్లు పలుకుతుండటం విశేషం. ఐతే ఈ చిత్రంపై పెట్టిన భారీ పెట్టుబడి దృష్ట్యా కనీసం 15 మిలియన్ డాలర్లు వసూలు చేస్తే తప్ప బయ్యర్ సేఫ్ జోన్లోకి రావడం కష్టం. ఐతే ప్రస్తుతం కనిపిస్తున్న హైప్ చూస్తుంటే ఆ వసూళ్లను అందుకోవడం అంత కష్టమేమీ కాదని అర్థమవుతోంది.English summary
Everyone are shocked about the potential of Telugu market in USA. Baahubali Telugu official crossed $3M at 3:00 PM EST. 1st South Indian film to do so. $4M is a possibility with Tamil version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu