»   » అయ్య బాబోయ్...! బాహుబలి కి ఇన్ని హంగులా...!? కామిక్ బుక్, యనిమేషన్ వీడియో విడుదల ఎప్పుడు ?

అయ్య బాబోయ్...! బాహుబలి కి ఇన్ని హంగులా...!? కామిక్ బుక్, యనిమేషన్ వీడియో విడుదల ఎప్పుడు ?

Posted By:
Subscribe to Filmibeat Telugu

"బాహుబలి" గత మూడేళ్ళుగా ఒక సంచలనం ఈ సినిమా. యావత్ భారత దేశ ఫిలిం ఇండస్ట్రీలేకాదు ప్రపంచం కూడా ఒక్క సారి తెలుగు సినిమా వైపు దృష్టి సారించేలా చేసిన సినిమా. ఈ సంచలనానికి కొనసాగిపంపు గా వస్తున్న బాహుబలి: ది కంక్లూజన్ గురించి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ అయినా సరే దాని మీద విపరీతమైన ఆసక్తితో ఉన్నారంతా. ఆ సినిమా మీద ఉన్న ఆసక్తి అలాంటిది మరి. మొన్నటికి మొన్న బాహుబలి ప్రెస్ మీట్ అనగానే జక్కన్న ఏం చెప్ప బోతున్నాడా అని అతృతగా ఎదురు చూసారంతా...

Also See: 'బాహుబలి-2' ఫుల్ స్టోరీ లీక్... సోషల్ మీడియాలో వైరల్!


అయితే ఆ కార్యక్రమంలో సినిమాలో వాడుతున్న వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ గురించి.. ఆ టెక్నాలజీలో రిలీజ్ చేయబోయే బాహుబలి వీడియోల గురించి చాలా ముచ్చట్లు చెప్పాడు రాజమౌళి. కానీ ఆసక్తిని అలాగే కంటిన్యూ చేయాలన్న ఉద్దేశం లో ఉన్న జక్కన్న 'బాహుబలి: ది కంక్లూజన్' గురించి కొత్త అప్ డేట్స్ ఏవీ ఆరోజు చెప్పలేదు. 'బాహుబలి: ది కంక్లూజన్' విషయంలో దేశమంతా ఆసక్తి ఉన్నా.. ముందు మన తెలుగు వాళ్ల కోసం ప్రత్యేకంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి.. మనతోనే విశేషాలు పంచుకోవడం ద్వారా మనవాళ్లను గౌరవించింది రాజమౌళి బృందం.


Baahubali 2 First Look On October 22

ఐతే ఇప్పుడు 'బాహుబలి' బృందం పెద్ద వేదికకు వెళ్తోంది. ఈ నెల 23న ప్రభాస్ పుట్టిన రోజు నేపథ్యంలో ఒక రోజు ముందే 'బాహుహుబలి: ది కంక్లూజన్' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడానికి ముంబయిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ను వేదికగా ఎంచుకుంది. అక్కడ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన అనంతరం రాజమౌళి, ప్రభాస్, రానాలతో పాటు బాహుబలి నిర్మాతలు కూడా 'మీట్ ది ప్రెస్'లో పాల్గొనబోతున్నారు. సినిమాకి సంబందించిన ఒక కామిక్ బుక్ నీ, ఒక యనిమేషన్ వీడియోని కూడా అదే రోజు విడుదల చేయనున్నారట


శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ చిత్రం 2017 ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే అక్టోబర్‌ 23న ప్రభాస్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసే అవకాశం ఉందట. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషించిన ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నాల పుట్టిన రోజు సందర్భంగా రాజమౌళి ఫస్ట్‌లుక్‌లు విడుదల చేశారు. మళ్లీ ఈసారి కూడా ప్రభాస్‌ పుట్టినరోజున 'బాహుబలి: ద కన్‌క్లూజన్‌' ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయబోతున్నాడన్న న్యూస్ తెలియగానే అందరూ ఆ రోజు కోసం ఎదురు చూడతం లోనే ఉన్నారు. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలిసే అవకాశం వుందని చిత్ర వర్గాల సమాచారం తో మరింత ఉత్కంఠ నెలకొంది.


Baahubali 2 First Look On October 22

ఈ న్యూస్ వినగానే దేశవ్యాప్త మీడియా అలెర్ట్ అయిపోయింది. ఈ మీట్ లో రాజమౌళి ఏం చెప్పబోతున్నాడో అంటూ అప్పుడే ఊహా గానాలు మొదలయ్యాయి. ఏ చిన్న అప్డేట్ వినిపిమంచినా దాన్ని వెంటనే జనానికి అందజేయాలన్న ఉత్సాహం కంటే ఈ సెన్సెషనల్ మూవీ గురించి తామే ముందు తెలుసుకోవాలన్న ఉత్సుకత కనిపిస్తోంది అందరిలోనూ.


మరి ఆ రోజు వీళ్లంతా 'బాహుబలి-2' గురించి ఏం కొత్త అప్ డేట్స్ ఇస్తారు.. మీడియా వాళ్లు అడిగే అనేకానేక ప్రశ్నలకు ఏం సమాధానం చెబుతారు.. మొన్న 'వర్చువల్ రియాలిటీ' వీడియోల గురించి కొత్త ముచ్చట్లు చెప్పినట్లే.. 'బాహుబలి-2' గురించి ఇంకేమైనా కొత్త కబుర్లు చెబుతాడా అని అంతా ఆసక్తితో ఉన్నారు. మరి ముంబయిలో బాహుబలి టీం ఏం చెప్పబోతోందో చూడాలి.

English summary
"The first look of the film will be unveiled on October 22, a day before Prabhas’ birthday. A comic book and a video too will be released on the same date.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu