twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బాహుబలి-2 వినాయకులు రెడీ అవుతున్నాయి (ఫోటోస్)

    త్వరలో రాబోతున్న వినాయక చవితి కోసం బాహుబలి సినిమాలో పాత్రలను తలపించేలా విగ్రహాలను రెడీ చేస్తున్నారు కళాకారులు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: బాహుబలి సిరీస్‌లో వచ్చిన రెండు సినిమాలకు దేశ వ్యాప్తంగా ఊహించని ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో త్వరలో రాబోతున్న వినాయక చవితి కోసం బాహుబలి సినిమాలో పాత్రలను తలపించేలా విగ్రహాలను రెడీ చేస్తున్నారు కళాకారులు.

    గతేడాది శివలింగాన్ని ఎత్తుకున్న శివుడి, గుర్రంపై ఉన్న బాహుబలి పాత్రను తలపించేలా వినాయక విగ్రహాలు తయీరు చేశారు. ఈ సారి ఏనుగుపై ఉండే అమరేంద్ర బాహుబలిని పోలిన విగ్రహాలు రెడీ అవుతున్నాయి. విగ్రహాల బ్యాగ్రౌండ్లో మాహిష్మతి రాజ్యాన్ని పోలిన సెట్టింగ్స్ కూడా ఉండటం విశేషం.

    సిద్ధమవుతున్న విగ్రహాలు

    సిద్ధమవుతున్న విగ్రహాలు

    వినాయకు చవితికి మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో హైదరాబాద్ శివార్లలో భారీ ఎత్తున విగ్రహాల తయారీ జరుగుతోంది. అక్కడ ఇలా బాహుబలి-2 సినిమాలోని పాత్రలను పోలిన విగ్రహాలు దర్శనమిచ్చాయి.

    సూపర్బ్

    సూపర్బ్

    ఈ విగ్రహాలు ఎంతో ఆకర్షణీయంగా ఉన్నాయని, వినాయక చవితి వరకు బాహుబలి ఫీవర్ కొనసాగడం ఖాయం అంటున్నారు ఈ విగ్రహాలు చూసిన వారు.

    గతంలో గబ్బర్ సింగ్, ఈగ విగ్రహాలు

    గతంలో గబ్బర్ సింగ్, ఈగ విగ్రహాలు

    గతంలో గబ్బర్, ఈగ మూవీ రూపాల్లోకూడా గణేష్ విగ్రహాలు రూపొందించారు. సినిమాల్లోని హీరోల రూపంలో విగ్రహాలు అప్పట్లో అందరినీ ఆశ్చర్య పరిచాయి.

    దేవిశ్రీ విగ్రహంకూడా

    దేవిశ్రీ విగ్రహంకూడా

    అయితే గతేడాది సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ రూపంలో వినాయక విగ్రహాన్ని రూపొందించడంపై విమర్శలు వచ్చాయి.

    English summary
    Vinayaka Chavithi will take place this year on 25th of August. Like every year, the idol makers are coming up with new concepts in designing Ganash idols for the festivals. In this way Baahubali 2 Ganash idols getting ready.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X