»   » ఆ దేశం లోనే ఇండస్ట్రీ హిట్ ఇక బాహుబలిదే.....

ఆ దేశం లోనే ఇండస్ట్రీ హిట్ ఇక బాహుబలిదే.....

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి 2 ఇప్పుడు దేశం లోఉన్న అన్ని "వుడ్" ల చూపు బాహూబలి పైనే ఉంది ఇప్పటి వరకూ టాలీవుడ్ లో బాహుబలి పార్ట్ 1 టాప్ రేంజ్ లో ఉండగా ఇప్పుడు మళ్ళీ అదే సినిమా కి సీక్వెల్ గా వచ్చిన బాహుబలి 2 ఆ రికార్ద్ ని బద్దలు కొట్టబోతోంది. బాలీవుడ్ లోనూ నెంబర్ వన్ గ్రాసర్ గా నిలబడే దిసలోనే బాహుబలి 2 సాగుతోంది.... ఇండియాలోనే కాకుండా మరో దేశంలోను బాహుబలి ఇండస్ట్రీ హిట్‌ కొట్టబోతోంది. నేపాల్‌ దేశంలో ఇప్పటికే బాహుబలి చిత్రానికి పది కోట్ల గ్రాస్‌ వసూలైంది.

ఇప్పటి వరకూ మన పొరుగు దేశమైన నేపాల్ లో 'చక్క పంజా' అనే చిత్రం పదిహేడు కోట్ల గ్రాస్‌తో టాప్‌లో వుందట. అయితే ఇప్పటికే 10 కోట్లు దాటేసిన బాహుబలి ఆ రికార్డుని త్వరలోనే దాటేయనుంది., కేవలం నాలుగు రోజుల్లో పది కోట్లు వసూలు చేసిన చిత్రం నేపాల్‌ చరిత్రలోనే లేదని, దాదాపు ఇండియామొత్తాన్నే కాక ఓవర్సీస్లోనూ ముందంజలోనే ఉన్న బాహుబలి కి ఇప్పుడు నేపాల్ లో కూడా విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

Baahubali 2 Is Super Hit In Nepal

బాలీవుడ్ నుంచి హిందీ వెర్షన్ లో వచ్చిన ప్రింట్ ఇప్పుడు నేపాల్ లో దుమ్మురేపుతోంది. బాహుబలి ఇండస్ట్రీ హిట్‌ ఆఫ్ నేపాల్ అని పించుకోవటానికి బాహుబలికి ఇప్పుడు వారం కంటే ఎక్కువ రోజులు పట్తకపోవచ్చు. అయితే ఒక్క నేపాల్లోనే కాదు ఇంకా చాలా దేశాల్లో బాహుబలి 2 ఎంత వసూలు చేస్తోందనేది సరిగా ట్రాక్‌ కావడం లేదు.

నాలుగు రోజుల్లో ఆరు వందల కోట్ల గ్రాస్‌ అనేది కేవలం అంచనానే అని, ఇంకా లెక్క తేలని, లెక్కలు తెలియని కలెక్షన్ల వివరాలు చాలానే వున్నాయని, పలు దేశాల్లో కలెక్షన్‌ ట్రాకింగ్‌ అసలు జరగడం లేదని, కనుక ఇంత వచ్చి వుంటాయంటూ చెప్పేవన్నీ కేవలం అంచనాలు మాత్రమే ననీ అంతున్నారు. అసలు లెక్కలు ఖచ్చితంగా తేలాలీ అంటే ఇంకొన్నాళ్ళు పట్టొచ్చట.

English summary
Baahubali took a record opening in Nepal, it was released in 130 theaters and has already grossed 10 Cr in 3 days. On Friday, it grossed 3 crores and on Sat it grossed 4 crores and on Sunday it grossed 3+ crores.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu