»   » కట్టప్ప చేసిన పనికి...‘బాహుబలి-2’ విడుదలకు గండం, వార్నింగ్!

కట్టప్ప చేసిన పనికి...‘బాహుబలి-2’ విడుదలకు గండం, వార్నింగ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగులూరు: ఉరుము ఉరుమి మంగళం మీద పడ్డట్లు తమిళనాడు-కర్నాటక మధ్య కొన్నేళ్లుగా రగులుతున్న కావేరీ జలాల వివాదం ఇపుడు బాహుబలి-2 సినిమాకు చిక్కులు తెచ్చి పెట్టేట్లే కనిపిస్తోంది. అసలు ఈ వివాదానికి కారణం కట్టప్ప... అంటే ఆ పాత్ర పోషించిన సత్యరాజ్.

కట్టప్ప చేసిన తప్పేంటి?

కట్టప్ప చేసిన తప్పేంటి?

తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం జరుగుతున్న తరుణంలో తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌ గతంలో తమిళనాడుకు కావేరీ నీటి సరఫరా అంశంపై కన్నడ సంఘాల పట్ల చులకనగా మాట్లాడారట.

అదును చూసి దెబ్బ

అదును చూసి దెబ్బ

సత్యరాజ్ తమకు ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురు చూస్తున్న కన్నడ సంఘాలకు.... ‘బాహుబలి-2' కట్టప్ప రూపంలో చిక్కినట్లయింది. ఇదే అదునుగా సత్యరాజ్ మీద ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమయ్యారు.

బెంగులూరులో నిరసన

బెంగులూరులో నిరసన

బాహుబలి-2 ప్రదర్శనను అడ్డుకుంటామని కన్నడ రక్షణ వేదిక కార్యకర్తలు హెచ్చరిస్తూ... బెంగులూరులోని ఎన్ఇ‌స్ సర్కిల్‌లో ప్రవీణ్‌కుమార్‌శెట్టి ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు.

అడ్డుకుని తీరుతాం

అడ్డుకుని తీరుతాం

బాహుబలి-2లో కట్టప్ప పాత్రధారి తమిళనాడుకు చెందిన సత్యరాజ్‌ గతంలో తమిళనాడుకు కావేరీ నీటి సరఫరా అంశంపై కన్నడ సంఘాల పట్ల చులకనగా మాట్లాడారన్నారు. దీన్ని ఖండిస్తూ బాహుబలి-2 విడుదల అడ్డుకుంటామన్నారు.

English summary
As per reports, the pro Kannada organisations have levelled allegations against actor Sathyaraj for his inflammatory statements against Karnataka during the Cauvery water crisis. For the same, the outfits have demanded Sathyaraj to apologise to Kannadigas.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu