»   » బాహుబలి ముందు మోకరిల్లిన అమీర్ ఖాన్: 24 గంటల్లో దంగల్ రికార్డ్ బద్దలు

బాహుబలి ముందు మోకరిల్లిన అమీర్ ఖాన్: 24 గంటల్లో దంగల్ రికార్డ్ బద్దలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇప్పుడు భారత దేశం మొత్తం ఒక మ్యానియా... దాని పేరు బాహుబలి 2. ఇప్పుడు టాలీవుడ్ సినిమా అంటే కేవలం తెలుగు వాళ్ళ సినిమా మాత్రమే కాదు దేశం మొత్తం ఎదురు చూసే సినిమా. "కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు? అన్న ప్రశ్న విలువ రమారమీ 1000 కోట్లు. ఇప్పటి వరకూ ప్రపంచం లోనే అతి ఖరీదైన ప్రశ్న ఇదేనేమో. ఆ సమాధానం కోసం ఊపిరి బిగబట్టుకొని మరీ ఎస్దురు చూస్తున్నారు.

24గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు

24గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు

వేలకు వేలు పోసి టికెట్లు కొంటున్నారు. సినిమా పై వచ్చే ప్రతీ వార్తనీ ఇంట్రస్ట్ గా చదువుతున్నారు.... ఇప్పుడు టికెట్ల అమ్మకాల్లో తాజాగా ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. 24గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు ఓ ఆన్‌లైన్‌ టికెట్ల విక్రయ పోర్టల్‌ వెల్లడించింది. దీనికి ముందు ఆన్‌లైన్‌ ద్వారా అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన సినిమా అమిర్‌ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘దంగల్‌'.ఇప్పుడు ఆ రికార్డ్ ని బాహుబలి బద్దలు కొట్టాడు.


6,500 థియేటర్లలో

6,500 థియేటర్లలో

కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడానికి ఇంకా కొన్ని గంటలు సమయం మాత్రమే మిగిలి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి: ది కన్‌క్లూజన్‌ శుక్రవారం 9వేల థియేటర్లలో విడుదల కాబోతోంది. దేశవ్యాప్తంగా 6,500 థియేటర్లలో ఈ సినిమా విడుదలవుతోంది.


ఆన్‌లైన్‌ విక్రయ పోర్టల్‌

ఆన్‌లైన్‌ విక్రయ పోర్టల్‌

ఈ నేపథ్యంలో అభిమానులు ఇప్పటికే థియేటర్ల వద్ద టికెట్ల కోసం బారులు తీరుతున్నారు. ప్రముఖ టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయ పోర్టల్‌ ‘బుక్‌ మై షో'లో ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' సినిమాకు సంబంధించిన టికెట్లను అందుబాటులోకి తీసుకురాగా 24గంటల్లో ఒక మిలియన్‌ టికెట్లు అమ్ముడుపోయినట్లు సదరు పోర్టల్‌ సిబ్బంది ఆశిశ్‌ సక్సేనా వెల్లడించారు.


తొలి వారం టిక్కెట్లు అయిపోయాయి

తొలి వారం టిక్కెట్లు అయిపోయాయి

రికార్డు స్థాయి బుకింగ్‌ని తాము వూహించలేదని, దక్షిణాదిప్రాంతాల్లో అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయని, ఒక్క రోజుకే ఇంత భారీ రెస్పాన్స్‌ రావడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఆయన తెలిపారు. మల్టీఫ్లెక్స్‌ల్లో ఇప్పటికే దాదాపు తొలి వారం టిక్కెట్లు అయిపోయాయని వార్తలు వినిపిస్తున్నాయి.English summary
Within 24 hours, one million movie's tickets were sold worldwide and that is so humongous that it broke the record of Aamir Khan's 'Dangal', which earlier was holding the record of enormous pre-booking requests.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu