»   » అదిరిపోయేలా బాహుసెల్ఫీ.. కత్తితో కరణ్ జోహర్..

అదిరిపోయేలా బాహుసెల్ఫీ.. కత్తితో కరణ్ జోహర్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా జరిగింది. సినీ చరిత్రలోనే కనీవిని ఎరుగని విధంగా వర్చువల్ రియాల్టీ 4 కే వీడియో రెజల్యూషన్‌తో ప్రత్యక్షం చేయడం విశేషంగా ఆకట్టుకొన్నది.

బాహుబలి టీమ్ సెల్ఫీ

బాహుబలి టీమ్ సెల్ఫీ

బాహుబలి ప్రీ రిలీజ్ కార్యక్రమం అనంతరం బాహుబలి టీమ్ అంతా కలిసి సెల్ఫీ దిగారు. ఈ సెల్ఫీ ఫొటోలో రానా దగ్గుబాటి, ప్రభాస్, అనుష్క శెట్టి, తమన్నా భాటియా, రమ్య కృష్ణ, సత్యరాజ్, నాజర్, డైరెక్టర్ రాజమౌళి, సెంథిల్ కుమార్, శోభు యార్లగడ్డ, ప్రసాద్, కరణ్ జోహర్ తదితరులు ఉన్నారు. ఈ సెల్ఫీ దిగడానికి బాలీవుడ్ ఫిలిం మేకర్ కరణ్ జోహర్ చొరవ తీసుకొన్నారు.

ప్రభాస్ ఎంట్రీ అదిరింది.

ప్రభాస్ ఎంట్రీ అదిరింది.

ఈ వేడుక సందర్భంగా ప్రభాస్ వేదికపైకి రావడం ఆకట్టుకొన్నది. అభిమానుల కేరింతల మధ్య వేదిక పై నుంచి రోప్స్ సహాయంతో ప్రభాస్ దిగడం అబ్బురపరిచింది.

ఉద్వేగంతో రానా

ఉద్వేగంతో రానా

బాహుబలిలో భళ్లాలదేవగా నటించిన రానా దగ్గుబాటి వేదిక మీదకు వస్తుండగా అభిమానులు ఈలలు, కేరింతలతో స్వాగతం పలికారు. రానా మాట్లాడుతూ.. తీవ్ర ఉద్వేగానికి లోనయ్యారు. మాహిష్మతి సెట్ వీడిపోవడం చాలా బాధగా ఉంది అని అన్నారు.

 యూనిట్ అంతా ఒకే బస్సు

యూనిట్ అంతా ఒకే బస్సు

బాహుబలి ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు వేర్వేరుగా కాకుండా చిత్ర యూనిట్ ఒకే బస్సులో వేదిక వద్దకు వచ్చారు. బస్సులో వస్తుండగా సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్, శోభు యార్లగడ్డ ఫోటోలు తీసి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ కార్యక్రమంలో రాజమౌళికి కరణ్ జోహర్ భారీ కత్తిని బహుకరించారు.

ఇప్పటికే రూ.500 కోట్లు

ఇప్పటికే రూ.500 కోట్లు

బాహుబలి2 చిత్రం ఇప్పటికే డిస్ట్రిబ్యూషన్, శాటిలైట్ రైట్స్ కింద రూ.500 కోట్లు వచ్చాయి. 2015లో విడుదలైన బాహుబలి1 చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.650 కోట్లు వసూలు చేసింది. జాతీయ ఉత్తమ చిత్ర అవార్డును సొంతం చేసుకొన్నది.

6500 స్క్రీన్లలో విడుదల

6500 స్క్రీన్లలో విడుదల

రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా దాదాపు 6500 స్క్రీన్లలో ఏప్రిల్ 28న విడుదలవుతున్నది. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అత్యధిక థియేటర్లలో విడుదలవ్వడం ఓ రికార్డు అని చెప్తున్నారు.

English summary
Ahead of the Baahubali: The Conclusion pre release event, KJo united the cast and crew who made Baahubali that extra bit special, for a selfie. And it's a wrap now, officially. The wait is for the movie to hit screens on April 28.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu