»   » బాహుబలి2 ప్రీ రిలీజ్: డిఫరెంట్‌గా ప్రభాస్ ఎంట్రీ.. చీఫ్ గెస్ట్‌గా రజినీ

బాహుబలి2 ప్రీ రిలీజ్: డిఫరెంట్‌గా ప్రభాస్ ఎంట్రీ.. చీఫ్ గెస్ట్‌గా రజినీ

Written By:
Subscribe to Filmibeat Telugu

సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా రూపుదిద్దుకున్న బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భారీ స్థాయిలో బాహుబలి2 చిత్ర ఆడియో రిలీజ్ ఫంక్షన్ ఆదివారం సాయంత్రం జరుగనున్న సంగతి తెలిసిందే. ఈ వేడుక కోసం రామోజీ ఫిలిం సిటీలోని మహీష్మతి రాజసౌధం బ్యాక్ డ్రాప్ అందంగా ముస్తాబైంది.

డిఫరెంట్‌గా ప్రభాస్ ఎంట్రీ

డిఫరెంట్‌గా ప్రభాస్ ఎంట్రీ

బాహుబలి2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకలో ప్రభాస్ ఎంట్రీ హైలెట్‌గా ఉంటుందని వేడుక నిర్వాహకులు వెల్లడించారు. ఈ వేడుకలో ప్రతీ అంశం కనివిని ఎరుగని రీతిలో నిర్వహించేందుకు రాజమౌళి ప్లాన్ చేశాడు. సినీ చరిత్రలో తొలిసారి వర్చువల్ రియాల్టీ సాంకేతికతతో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ను నిర్వహించనున్నారు.

పలువురు సినీ ప్రముఖులు హాజరు

పలువురు సినీ ప్రముఖులు హాజరు

ఈ వేడుకలో పాలుపంచుకొనేందుకు దక్షిణాది పరిశ్రమలోని పలువురు అగ్రనటులు, ప్రముఖులు ప్రత్యేకంగా వస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే దర్శకుడు రాజమౌళి పలువురికి ప్రత్యేక ఆహ్వానాలు పంపినట్టు తెలిసింది.

చెన్నై ఫంక్షన్‌కు తలైవా రజనీ

చెన్నై ఫంక్షన్‌కు తలైవా రజనీ

తమిళనాడులో నిర్వహించే బాహుబలి ది కన్‌క్లూజన్‌ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నట్లు సినీవర్గాల నుంచి సమాచారం అందింది. ఏప్రిల్‌ 9న చెన్నైలో జరగబోయే తమిళ ఆడియో విడుదల కార్యక్రమానికి రజనీకాంత్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రజనీతోపాటు పలువురు దక్షిణాది సినీ ప్రముఖులు ఈ

వేడుకకు హాజరుకానున్నట్టు సమాచారం.

తొలిసారి వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ

తొలిసారి వర్చువల్ రియాల్టీ టెక్నాలజీ

వర్చువల్ రియాల్టీ సాంకేతికతతో ఆడియో రిలీజ్ ఫంక్షన్ నిర్వహించడం భారత్‌లో ఇదే తొలిసారి. అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించేందుకు వేదికకు ఇరువైపుల కెమెరాలను బిగించారు. వేడుకలో భాగమైనట్టు ఫ్యాన్స్‌కు ఫీలింగ్ కలిగించే విధంగా అత్యున్నత సాంకేతితను వినియోగించారు. 360 డిగ్రీల కోణంలో కార్యక్రమాన్ని వీక్షకులకు 4కే వీడియో రెజల్యూషన్‌తో అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

ఆరు కోట్లు చెల్లించి రైట్స్ దక్కించుకొన్న లహరీ

ఆరు కోట్లు చెల్లించి రైట్స్ దక్కించుకొన్న లహరీ

బాహుబలి2 మ్యూజిక్ రైట్స్‌ను లహరీ రికార్డింగ్ కంపెనీ దక్కించుకొన్నది. ఈ మ్యూజిక్ రైట్స్ కోసం కంపెనీ దాదాపు రూ.6 కోట్లు చెల్లించినట్టు సమాచారం. ఆడియో ధర ఇంతమొత్తంలో పలుకడం టాలీవుడ్‌లో ఇదే తొలిసారి.

ఐదుపాటల సీడీ విడుదల

ఐదుపాటల సీడీ విడుదల

సంగీత దర్శకుడు కీరవాణి సంగీత సారథ్యంలో విడుదల కానున్న ఈ పాటలు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటాయని చిత్ర యూనిట్ విశ్వాసంతో ఉన్నది. ఈ సినిమా పాటలకు సంబంధించిన వివరాలు ఇప్పటికే బయటకు వచ్చాయి. బాహుబలి2 సినిమాలో మొత్తం 5 పాటలున్నట్లు ఫేస్ బుక్‌లో పోస్ట్ చేసిన ఆడియో కవర్ ద్వారా తెలిసింది. 1. సాహోరే బాహుబలి, 2. హంస నావ, 3. కన్నా నిదురించరా, 4. దండాలయ్యా, 5. ఒక ప్రాణం ఆడియోలో ఉన్నాయి.

రానా, అనుష్క, తమన్నా, రాఘవేంద్రరావు..

రానా, అనుష్క, తమన్నా, రాఘవేంద్రరావు..

బాహుబలి2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేదిక వద్దకు ఇప్పుడిప్పుడే సినీ ప్రముఖులు చేరుకొంటున్నారు. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, రానా, కెమెరామెన్ సెంథిల్, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ తదితరులు హాజరయ్యారు.

కేరళలో 500 థియేటర్లలో రిలీజ్

కేరళలో 500 థియేటర్లలో రిలీజ్

బాహుబలి2 చిత్రం కేరళలో కూడా ప్రభంజనం సృష్టించబోతున్నది. ఈ చిత్రం కేరళ వ్యాప్తంగా అత్యధికంగా ఎక్కువ థియేటర్లలో రిలీజ్ కానున్నది. ఈ చిత్రం దాదాపు 300 థియేటర్లలో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది.

ఏప్రిల్ 28న విడుదలకు సిద్దం

ఏప్రిల్ 28న విడుదలకు సిద్దం

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ కీలక పాత్రల్లో నటించారు. ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వం వహించారు. ‘బాహుబలి ది: బిగినింగ్‌'కు కొనసాగింపుగా వస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు రానున్నది.

English summary
Baahubali 2 pre-release event: Actor Nani will be hosting this spectacular event from the grand Mahishmati Kingdom set, which is recreated at the Ramoji Film City in Hyderabad. Producer of Baahubali, Shobu Yarlagadda, has promised fans a lot of surprises during the event.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu