»   » రికార్డులు గల్లంతు కాదు అసలు చెప్పుకోవటానికీ దమ్ముకావాల్సిందే : దుమ్ము రేపిన బాహుబలి

రికార్డులు గల్లంతు కాదు అసలు చెప్పుకోవటానికీ దమ్ముకావాల్సిందే : దుమ్ము రేపిన బాహుబలి

Posted By:
Subscribe to Filmibeat Telugu

గంటకు 12 లక్షలు.. బాహుబలి ట్రైలర్ విషయంలో వస్తున్న సగటు వ్యూస్ ఇవి. మామూలుగా ఓ ట్రైలర్‌కు మిలియన్ వ్యూస్ రావాలంటే కనీసం పది గంటలు పడుతుంది. కానీ, గంటకు పది లక్షల చొప్పున వ్యూస్‌ను తన ఖాతాలో వేసుకుంటూ దూసుకెళ్లిపోతోంది బాహుబలి- ద కన్‌క్లూజన్ ట్రైలర్. నాలుగు గంటల్లో రెండు మిలియన్ వ్యూస్ దాటిన ట్రైలర్.. మరో మూడు గంటలు గడిచాక అందుకోలేనంత స్థాయికి దూసుకెళ్లిపోయింది. ఏడు గంటల్లో 8 మిలియన్ల వ్యూస్ దాటిపోయింది. ఇంకా కరెక్ట్‌గా చెప్పాలంటే 85,13,743 వ్యూస్ దాని సొంతమయ్యాయి.

ఇప్పటి వరకు యూట్యూబ్‌లో పోస్టయిన భారత్ సినిమా ట్రైలర్లలో అత్యధిక వ్యూస్ షారూక్ ఖాన్ రాయిస్ సినిమాకు వచ్చాయి. దాన్ని బాహుబలి అధిగమించి రికార్డు సృష్టించింది. తొమ్మిది గంటల్లో బాహుబలి కోటీ వ్యూస్‌ను సాధించింది. అది మరింతగా దూసుకుపోతోంది.


క్షణాల్లోనే

ఇక, క్షణాల్లోనే ఆ వ్యూస్ అంతకంతకు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే బాక్సాఫీస్‌ రికార్డుల పరంగా 'నాన్‌-బాహుబలి' అంటూ సెకండ్‌ ప్లేస్‌ కోసమే పోటీ జరుగుతోంది. సాధారణ సినిమాలు అందుకోలేని అసాధారణ స్థాయి రికార్డులని సెట్‌ చేసిన బాహుబలి ఇప్పుడు యూట్యూబ్‌లోను రికార్డులన్నిటినీ బ్రేక్‌ చేసి పారేసింది.


అయిదు గంటల్లో

అయిదు గంటల్లో

ట్రెయిలర్‌ అప్‌లోడ్‌ అయిన అయిదు గంటల్లో యాభై అయిదు లక్షలకి పైగా వ్యూస్‌ రికార్డ్‌ అయినట్టు ఎనలిటిక్స్‌ చెబుతున్నాయి. ఇక లైక్స్‌ అయితే లక్షల కొద్దీ నమోదవుతున్నాయి. ఇరవై నాలుగు గంటల్లో ఇన్ని మిలియన్లు, అన్ని మిలియన్లు అంటూ ఇటీవల సోషల్‌ మీడియాలో రచ్చ బాగా జరుగుతోంది.


నిముషాల్లోనే కోటి

నిముషాల్లోనే కోటి

4 గంటలు.. 20 లక్షలు! 6 గంటలు.. 60 లక్షలు! 7 గంటలు.. 85 లక్షలు! 7 గంటలు దాటి నిముషాల్లోనే కోటి...! ఇదీ.. బాహుబలి-2 ట్రైలర్ రికార్డుల పరంపర. కోటి వ్యూస్ దాటిపోయింది. మామూలుగా అయితే ఓ సినిమాకు సంబంధించి ట్రైలర్‌కు కోటి వ్యూస్ రావాలంటే దాదాపు నెల రోజులపైనే పడుతుంది.


కోటి మంది

కోటి మంది

అలాంటిది ఒక్కరోజు కూడా గడవలేదు.. ఒక్క రోజు దాకా ఎందుకు పది గంటలైనా కాలేదు ట్రైలర్ విడుదలై.. కోటి మంది బాహుబలి-2 ట్రైలర్‌ను చూసేశారు చూస్తూనే ఉన్నారు. గంటల్లో ఫిగర్ మారిపోతేనే అది ఓ అద్భుతం. కానీ, నిముషాల్లోనే లక్షలకు..లక్షల వ్యూస్‌ను కొల్లగొట్టేస్తోంది జక్కన్న చెక్కిన బాహుబలి-2 ట్రైలర్. మొత్తంగా ఇప్పటిదాకా 1,01,71,536 మంది ఈ ట్రైలర్‌ను చూశారు.


ఇంకెన్ని రికార్డులు కనుమరుగవుతాయో.

ఇంకెన్ని రికార్డులు కనుమరుగవుతాయో.

ఈ బాహుబలి సునామీ.. మిగతా రికార్డులన్నిటినీ కలిపి మడతెట్టేస్తోంది. ఇప్పటిదాకా ఉన్న రికార్డులన్నిటినీ కట్టగట్టి కనుమరుగుచేసేస్తోంది. బాహుబలిపై ఎన్నెన్ని అంచనాలున్నాయో ఈ రికార్డుల లెక్కలే చెప్పకనే చెబుతున్నాయి. సినిమా విడుదలైతే ఇంకెన్ని రికార్డులు కనుమరుగవుతాయో.


యూట్యూబ్‌ లో కూడా

యూట్యూబ్‌ లో కూడా

ఇకపై యూట్యూబ్‌ లో కూడా నాన్‌ బాహుబలి రికార్డులు చెప్పుకోవాల్సిందే. రోజు తిరగకుండా కోటి వ్యూస్‌ దాటేసేలా వుంది పరిస్థితి. రాజమౌళి ట్రెయిలర్‌తోనే ఈసారి సినిమా ఎలా వుండబోతుందనేది స్పష్టం చేసేసాడు. మొదటి సినిమాలో ఎమోషన్లు లేవని, ఏదో టైమ్‌ పాస్‌ చేసేసారని కామెంట్స్‌ వచ్చాయి.


ట్రెయిలర్‌లోనే

ట్రెయిలర్‌లోనే

రెండున్నర నిమిషాల ట్రెయిలర్‌లోనే ఎమోషన్స్‌ పీక్స్‌లో పండించిన విధానం చూస్తే తెరపై కళ్లు చెదిరే అద్భుతం సాక్షాత్కరించడం ఖాయమనిపిస్తోంది. ఇంకెన్ని కొత్త రికార్డులు సృష్టిస్తుందో అంచనాకైనా అందదేమో. చూద్దాం బాహుబలి రికార్డుల జర్నీ ఎక్కడిదాకా వెళ్తుందో.. ఎక్కడ ముగుస్తుందో!!


English summary
While we all know that S S Rajamouli's magnum opus, 'Baahubali' has set the records high, its sequel, 'Baahubali: The Conclusion' is only hitting even harder.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu