»   » బాహుబలి దండయాత్ర ఇంకా సాగుతోంది: ట్రైలర్ కి 15 కోట్ల వ్యూస్

బాహుబలి దండయాత్ర ఇంకా సాగుతోంది: ట్రైలర్ కి 15 కోట్ల వ్యూస్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి అంటే రికార్డ్స్, రికార్డ్స్ అంటే బాహుబలి అన్నట్టు తయారైంది పరిస్థితి.. టాలీవుడ్ లో ఏ సినిమా సాధించనటువంటి రికార్డులను నెలకొల్పింది బాహుబలి మొదటి పార్ట్.. ఇప్పుడు ఆ కోవలోనే బాహుబలి 2 సినిమా కూడా వెళ్తుంది. కేవలం ట్రైలర్ తో టాలీవుడ్ నే కాదు ఇండియన్ సినిమా నే షేక్ చేస్తుంది బాహుబలి2 సినిమా.. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా ట్రైలర్ ఇంకా యూట్యూబ్ లో హల్చల్ చేస్తూనే ఉంది.ఒక పక్క సినిమా వచ్చి కూదా నెలలు దాటుతూంటే ఇప్పటికీ ట్రైలర్ కి వ్యూస్ వస్తూండటం గమనార్హం....

అన్ని భాషల్లో కలిపి.. అన్ని ఫ్లాట్ ఫామ్స్‌ నుంచి 'బాహుబలి: ది కంక్లూజన్' ట్రైలర్‌కు 150 మిలియన్స్.. అంటే 15 కోట్ల వ్యూస్ రావడం విశేషం. ఇప్పటిదాకా ఏ ఇండియన్ సినిమా ట్రైలర్ కూడా కనీసం 5 కోట్ల మైలురాయిని కూడా అందుకోలేదు. అలాంటిది 15 కోట్ల వ్యూస్ అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ రికార్డును సమీప భవిష్యత్తులో ఏ సినిమా కూడా బద్దలుకొట్టే అవకాశం లేనట్లే.


Baahubali 2 trailer garners 150 million views

ఇక 'బాహుబలి-2' వసూళ్ల ప్రభంజనం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండియా వరకు మరే సినిమా కూడా ఇంకొన్నేళ్ల పాటు దరిదాపుల్లోకి రాలేని స్థాయిలో వసూళ్లు రాబట్టిందీ సినిమా. ఇండియా వరకే ఈ చిత్రానికి దాదాపు రూ.1500 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా వసూల్లు రూ.1800 కోట్లకు చేరువగా వెళ్లాయి. బాహుబ‌లి స్టార్సంతా ప్ర‌మోష‌న్ కోసం చైనా వెళ్ల‌నున్న‌ట్లు సమాచారం. చైనాలో దంగ‌ల్‌ను ప్రమోట్ చేసిన డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీనే బాహుబ‌లి 2 మేక‌ర్స్ సంప్ర‌దించారు. దంగ‌ల్ ఇండియాలో కంటే చైనాలోనే ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సంగతి తెలిసిందే.


ఇప్పుడ‌దే కంపెనీ ప్ర‌మోట్ చేస్తే.. బాహుబ‌లి 2 చైనాలోనూ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం ఖాయమని సినీ యూనిట్ భావిస్తోంది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ సినిమా ఇప్ప‌టికే రూ.1500 కోట్ల‌కుపైగా వ‌సూలు చేసిన నేప‌థ్యంలో.. చైనాలోనూ అదే రేంజ్‌లో వ‌స్తే మాత్రం దంగ‌ల్‌ను వెన‌క్కి నెట్టడం ఖాయమని సినీ పండితులు జోస్యం చెప్తున్నారు.


English summary
All the versions of Baahubali 2 trailer have amassed a combined 150 million views on YouTube
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu