»   » ‘బాహుబలి 2’ ట్రైలర్‌ పై అవి రూమర్సే అని రాజమౌళి తేల్చారు

‘బాహుబలి 2’ ట్రైలర్‌ పై అవి రూమర్సే అని రాజమౌళి తేల్చారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న చిత్రం 'బాహుబలి 2' . ప్రపంచ వ్యాప్తంగా మంచి విజయం సాధించిన 'బాహుబలి'కి కొనసాగింపుగా రూపొందిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్‌తోపాటు రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 28న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.

ఇక ఈ చిత్రం టీజర్ ని బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ ...రేసిస్ చిత్రం తో ఎటాచ్ చేసి పబ్లిసిటీకు తెర లేపుతున్నారంటూ మీడియాలో వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే అవి రూమర్స్ అని తేలిపోయింది.


అయితే ట్రైలర్‌ను 'రయీస్‌'తో పాటు విడుదల చేయడం లేదని చిత్ర యూనిట్ ట్విటర్‌ ద్వారా ప్రకటించింది. ''బాహుబలి 2' ట్రైలర్‌ 'రయీస్‌'తో జతచేసి విడుదల చేస్తున్నారని పుకార్లు వచ్చాయి. ఈ వార్తలు నిజం కాదని స్పష్టం చేస్తున్నాం. 'బాహుబలి 2' ట్రైలర్‌ విడుదల తేదీని సమయం వచ్చినప్పుడు మేమే అధికారికంగా ప్రకటిస్తాం' అని చిత్ర యూనిట్ ట్వీట్‌ చేసింది.


Baahubali 2 trailer not attached to SRK's Movie!

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్‌, అనుష్క, రానా, తమన్నా ప్రధాన పాత్రల్లో నటించిన 'బాహుబలి 2' చిత్రం షూటింగ్‌ ఇటీవల పూర్తయింది. 'బాహుబలి'కి కొనసాగింపుగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 28న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు.


తెలుగుతో పాటు తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో కూడా బాహుబలి సినిమాను భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్లాన్ చేస్తున్నారు.

English summary
'Baahubali ' team...categorically stated that the teaser is not going to be attached with Shah Rukh Khan's movie. No date has yet been fixed for the trailer launch of 'Baahubali 2'.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu