»   » ‘బాహుబలి-2’ ట్రైలర్ సునామీ: గంటల్లోనే కోట్లు కురిపిస్తోంది, ఇవీ లెక్కలు..

‘బాహుబలి-2’ ట్రైలర్ సునామీ: గంటల్లోనే కోట్లు కురిపిస్తోంది, ఇవీ లెక్కలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన 'బాహుబలి-ది కంక్లూజన్' ట్రైలర్ ఈ రోజు ఉదయం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్ వ్యూస్ పరంగా సునామీ క్రియేట్ చేస్తోంది. గంటల్లోనే కోట్ల కొద్దీ వ్యూస్ కురిపిస్తోంది.

తొలి 5 గంటల్లోనే ఈ ట్రైలర్ 5 మిలియన్(50 లక్షలు) వ్యూస్ సొంతం చేసుకుంది. ఇప్పటికే(సాయత్రం 4 గంటలకు) ఈ ట్రైలర్ 7 మిలియన్ వ్యూస్ క్రాస్ అయింది. ఇది కేవలం తెలుగు వెర్షన్ కు సంబంధించిన లెక్కలు మాత్రమే.

కోటి దాటింది

బాహుబలి-ది కంక్లూజన్ ట్రైలర్ ఉదయం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మళయాలంలో రిలీజ్ చేసారు. అన్ని వెర్షన్లు కలిపి సాయంత్రం 4 గంటల వరకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. అందులో తెలుగు నుండే 7 మిలియన్(70 లక్షలు) వ్యూస్ వచ్చాయి.

ఫస్ట్ పార్టును తలదన్నేలా వ్యూస్

2015లో విడుదలైన బాహుబలి-ది బిగినింగ్ ట్రైలర్ రిలీజ్ అవ్వగా ఇప్పటి వరకు అది 78.41లక్షల వ్యూస్‌ సొంతం చేసుకుంది. అయితే ఈ రోజు విడుదలైన బాహుబలి-2 ట్రైలర్ కొన్ని గంటల్లోనే ఆ మార్కును దాటేసింది.

హిందీలోనూ భారీ స్పందన


బాహుబలి హిందీ వెర్షన్ ట్రైలర్ కు కూడా మంచి స్పందన వస్తోంది. ఇప్పటి వరకు(సాయంత్రం 4 గంటల వరకు) ఈ ట్రైలర్ కు 3.2 మిలియన్(32 లక్షలు) వ్యూస్ వచ్చాయి.

తమిళ, మళయాలంలో

అయితే తమిళం, మళయాలంలో విడుదలైన ట్రైలర్ తెలుగు, హిందీతో పోలిస్తు స్పందన తక్కువగానే ఉంది. సాయంత్రం 4 గంటల వరకు తమిళంలో 6 లక్షల పైచిలుకు వ్యూస్ రాగా, మళయాలంలో 2 లక్షల పైచిలుకు వ్యూస్ మాత్రమే వచ్చాయి.

English summary
Baahubali: The Conclusion trailer as opened to outstanding reception from fans all over the world. The film has clocked more than 5 million views on YouTube.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu