»   » మహా బాహుబలి 2..! ఎన్నిథియేటర్లో తెలుసా..!? ఒక్క క్షణం గుండె చిక్కబట్టుకోండి

మహా బాహుబలి 2..! ఎన్నిథియేటర్లో తెలుసా..!? ఒక్క క్షణం గుండె చిక్కబట్టుకోండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

'బాహుబలి-2' విడుదలకు ముందే మరో రికార్డు సాధించింది. ప్రపంచ సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తితో ఎదురుచూస్తున్న 'బాహుబలి-2' చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించినట్టు సమాచారం. గతవారం విడుదలైన ట్రైలర్ కు అద్భుత స్పందన రావడంతో థియేటర్ల సంఖ్యను పెంచాలని భావించిన నిర్మాతలు ఈ మేరకు మరిన్ని థియేటర్లను తీసుకున్నారని తెలుస్తోంది.మొత్తం థియేటర్ల సంఖ్య ఎంతో తెలిస్తే మీకు షాక్ తగలటం ఖాయం... ఇంతకీ ఆ నంబర్ ఎంతో తెలుసా...

అత్యధిక థియేటర్లలో

అత్యధిక థియేటర్లలో

ఇప్పటికే ఆన్‌లైన్‌లో అత్యధికమంది వీక్షించిన ట్రైలర్‌గా 'బాహుబలి-2' రికార్డు సృష్టించగా.. ఇప్పుడు అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రంగా ఘనతను సొంతం చేసుకోబోతున్నది. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.


ఇదే ప్రథమం

ఇదే ప్రథమం

దేశంలో ఇంతటి సంఖ్యలో థియేటర్లలో ఓ సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం. "భారత్‌లో 'బాహుబలి-2' 6500 థియేటర్లలో విడుదల కానుంది. భారత్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే" అని ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు.


ట్రైలర్‌ 100 మిలియన్‌లకుపైగా వ్యూస్‌

ట్రైలర్‌ 100 మిలియన్‌లకుపైగా వ్యూస్‌

ఇప్పటికే యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్‌ 100 మిలియన్‌లకుపైగా వ్యూస్‌ను సాధించి దూసుకుపోతున్నది. ఒక ట్రైలర్‌ ఇంతటి రెస్పాన్స్‌ సాధించడం భారత చిత్రపరిశ్రమలో ఇదే తొలిసారి. పాపులర్‌ సాంగ్స్‌ మాత్రమే యూట్యూబ్‌లో ఈ స్థాయిలో వ్యూస్‌ సాధించాయి. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తుండటంతో దేశవ్యాప్తంగా విడుదలవుతున్న 6500 థియేటర్లలోనూ ఈ సినిమా హౌస్‌ఫుల్‌ అయ్యే అవకాశముందని భావిస్తున్నారు.


 షాకింగ్ డెసిష‌న్

షాకింగ్ డెసిష‌న్

బాహుబలి 2ను విజువల్‌పరంగా ఎంత ఘనంగా తెరకెక్కించినా.. థియేటర్లలో ప్రొజెక్టర్స్‌ కూడా అంతే ఘనంగా చూపించగలగాలి. ఇందుకోసం బాహుబ‌లి 2న రిలీజ్ అవుతోన్న 2 వేల థియేట‌ర్ల యాజ‌మాన్యాలు కేవ‌లం బాహుబ‌లి 2 కోస‌మే ఓ షాకింగ్ డెసిష‌న్ తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.


అడ్వాన్స్డ్ టెక్నాలజీతో

అడ్వాన్స్డ్ టెక్నాలజీతో

4 కె రిజల్యూషన్‌తో కూడిన ప్రొజెక్టర్స్‌తో సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలని నిర్ణయం తీసుకున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 2వందల థియేటర్లు బాహుబలి2 కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కొత్త సొబగులు అద్దుకోనున్నాయి. ఇలా మారేందుకు ఒక్కో థియేట‌ర్‌కు ఏకంగా కోటి రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చు చేయాల్సి ఉంది.


సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతోనే

సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతోనే

అంత ఖ‌ర్చు అవుతున్నా సినిమాపై ఉన్న న‌మ్మ‌కంతోనే థియేట‌ర్ యాజ‌మాన్యాలు అంత ఖ‌ర్చు చేసేందుకు వెనుకంజ వేయ‌డం లేద‌ట‌. మ‌రి కొన్ని థియేట‌ర్ల యాజ‌మాన్యాలు మాత్రం 4కె ప్రొజెక్టర్స్ అద్దెకు తెచ్చుకుని ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారట.


దేశ‌వ్యాప్తంగా 2 వేల థియేట‌ర్ల యాజ‌మాన్యాలు

దేశ‌వ్యాప్తంగా 2 వేల థియేట‌ర్ల యాజ‌మాన్యాలు

గ‌తంలో బాహుబ‌లి ప్ర‌ద‌ర్శ‌న స‌మ‌యంలో కేర‌ళ‌లోని ఓ సినిమా థియేట‌ర్లో ఈ సిస్ట‌మ్‌లో ప్ర‌ద‌ర్శిస్తే వాళ్ల‌కు రూ 3.5 కోట్లు లాభం వ‌చ్చింద‌ట‌. దీంతో ఇప్పుడు బాహుబ‌లి 2 కోసం దేశ‌వ్యాప్తంగా 2 వేల థియేట‌ర్ల యాజ‌మాన్యాలు ఈ ప‌ద్ధ‌తిని ఫాలో అయ్యేందుకు రెడీ అవుతున్నాయి. ఓ సినిమాకు ఇంత‌లా థియేట‌ర్లు త‌మ ప్రొజెక్ట‌ర్ సిస్ట‌మ్ మార్చుకోవ‌డం ఇండియాలోనే పెద్ద‌ రికార్డుగా నిల‌వ‌నుంది. ఈ రకంగా కూడా బాహుబలి మరో రికార్డుని తన ఖాతాలో వేసుకోనున్నాడు.


వచ్చే నెల 28న

వచ్చే నెల 28న

కాగా, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో వచ్చే నెల 28న ఈ చిత్రం విడుదల కానున్న సంగతి తెలిసిందే. సరాసరిన ఒక్కో థియేటరులో 400 మంది ప్రేక్షకులు రూ. 100 చెల్లించి చిత్రాన్ని చూస్తారనుకుంటే, రోజుకు నాలుగు షోలు వేసిన పక్షంలో తొలి రోజు కలెక్షన్ రూ. 120 కోట్లు చేరుకుని, కలెక్షన్ల సునామీ సృష్టించడంతో పాటు కొత్త రికార్డులు నమోదవుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


 ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్

ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్

ప్రభాస్, దగ్గుబాటి రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ ముఖ్యపాత్రధారులుగా రూపొందిన ఈ సినిమాకు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. ఈ నెల 26న ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించనున్నారు.


English summary
Filmmaker SS Rajamouli's magnum opus Baahubali: The Conclusion will be released in 6,500 screens across India, say reports.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu