»   » కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్

కట్టప్ప దిగొచ్చాడు: కన్నడ ప్రజలకు లేఖ, బాహుబలికి లైన్ క్లియర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కావేరీ జలాల వినియోగంపై నటుడు సత్యరాజ్‌ చేసిన వ్యాఖ్యలు కర్నాటక ప్రజల్ని హర్ట్‌ చేసాయి. దాంతో అతడు నటించిన సినిమాలని కర్నాటకలో విడుదల కానీయకుండా అడ్డుకోవాలని చూస్తున్నారు. అతను బహిరంగ క్షమాపణ చెప్పకపోతే ఏప్రిల్‌ 28న కర్నాటకలో ఈ చిత్రాన్ని విడుదల చేయనివ్వమని అంటున్నారు. ఇప్పటికే ఏప్రిల్‌ 28న కర్నాటక బంద్‌ కూడా తలపెట్టారు నిరసనకారులు.

బాహుబలి

బాహుబలి

నిజానికి కర్నాటక చరిత్రలోనే బాహుబలి అతి పెద్ద విజయాన్ని సాధించింది. దాంతో రెండో భాగంపై ఇంకా భారీ స్థాయిలో వ్యాపారం జరిగింది. ఇప్పుడీ వ్యవహారం ముదిరి సినిమా ప్రదర్శన కనుక నిలిచిపోతే.. నలభై కోట్లు పెట్టి హక్కులు తీసుకున్న బయ్యర్‌ మునిగిపోతాడు.


కర్ణాటక బాహుబలి వ్యాపారులు

కర్ణాటక బాహుబలి వ్యాపారులు

ఎగ్జిబిటర్లు కూడా తీవ్రంగా నష్టపోతారు. ఈ సమస్యకి పరిష్కారాన్ని ఎంత త్వరగా కనుక్కుంటే అంత మంచిదని కర్ణాటక బాహుబలి వ్యాపారులు కోరుతున్నారు. ముందు ఈ ఇష్యూ సింపుల్ గా స‌మ‌సిపోయేలా క‌నిపించినా.. రోజురోజుకు ఇంకా కాంప్లికేట్ అవుతుంది. దాంతో స్వ‌యంగా ఇప్పుడు రాజ‌మౌళే రంగంలోకి దిగాడు.


కావేరీ జ‌లాల‌తో బాహుబ‌లికి ఏంటి సంబంధం

కావేరీ జ‌లాల‌తో బాహుబ‌లికి ఏంటి సంబంధం

సినిమాను బ‌య‌టి విష‌యాల‌తో ముడి పెట్ట‌డం మంచిది కాదంటున్నాడు రాజ‌మౌళి. అస‌లు కావేరీ జ‌లాల‌తో బాహుబ‌లికి ఏంటి సంబంధం.. ఇది భారీ బ‌డ్జెట్ సినిమా.. దీన్ని అడ్డుకుంటే కోట్ల‌ల్లో న‌ష్టం త‌ప్ప‌ద‌ని అర్థ‌మ‌య్యేలా క‌న్న‌డిగుల‌కు చెప్పే ప్ర‌య‌త్నం చేస్తున్నాడు రాజ‌మౌళి. దీనికోస‌మే ఎప్రిల్ 20న ఓ అప్పీల్ చేసుకున్నాడు జ‌క్క‌న్న‌ అయితే ఇక అదీ వర్క్ ఔట్ కాదనుకున్నాఋఓ ఏమో గానీ డైరెక్ట్ గా కట్టప్ప సత్యరాజే రంగం లోకి దిగాడు..


కన్నడ ప్రజలకి వ్యతిరేకం కాదనీ

కన్నడ ప్రజలకి వ్యతిరేకం కాదనీ

తాను కన్నడ ప్రజలకి వ్యతిరేకం కాదనీ... బాహుబలి విడుదలను అడ్డుకోవద్దంటూ కన్నడ లోనే రాసుకున్న క్షమాపన లేఖని చదివి వినిపించాడు. మరి ఇప్పుడైనా కన్నడిగులు శాంతిస్తారో లేదో చూడాలి. ఇది బానే ఉంది గానీ కట్టప్ప క్షమాపనలకి తమిళులు హర్టయితే ఇంకో కష్టాన్ని భుజాన వేసుకున్నట్టే అవుతుందేమో...English summary
Prabhas and Rana Daggubati's Baahubali 2 is facing the wrath of Kannada groups in Karnataka. An objectionable speech made by Sathyaraj, (in 2008), who plays an important role in the film, is now haunting the team as the protesters are demanding an unconditional apology from the Tamil actor. So Todey satyaraaj said Apology To kannada people..
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu