»   » బాహుబలి స్టంట్ మాస్టర్ తో మెగా హీరో "విన్నర్" అయిపోతాడా

బాహుబలి స్టంట్ మాస్టర్ తో మెగా హీరో "విన్నర్" అయిపోతాడా

Posted By:
Subscribe to Filmibeat Telugu

మేనమామ మూవీలను, సాంగ్స్ ను లేటెస్ట్ గా చూపడం ఆరితేరిపోయాడు మన మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధర్మ తేజ. తాజాగా ఆయన టైటిల్ ను సైతం కొట్టేశాడు. 30 ఏళ్ల క్రితం చిరంజీవి నటించిన సూపర్ హిట్ సినిమా విజేత'.. ఇప్పుడిదే పేరుతో చిరు మేనల్లుడు సాయిధరమ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.. అప్పటి 'విజేత'ను ఇప్పటి ట్రెండ్‌కి తగ్గట్టు 'విన్నర్'గా మార్పు చేశాడు. . సాయిధరమ్ తేజ్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), 'ఠాగూర్' మధు నిర్మిస్తున్న చిత్రం ఇది. ఈ మూవీ ఫస్ట్ లుక్ లో సాయి హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. ఈ మూవీ పాటలను . ఉక్రెయిన్‌లో ఇస్తాంబుల్‌లో క్లైమాక్స్‌ను చిత్రీకరించనున్నారు.

టర్కీలోని ఇస్తాంబుల్లో విన్నర్ క్లైమాక్స్ కి సంబంధించిన యాక్షన్ పార్ట్ ను చిత్రీకరించారు. ఆ సన్నివేశాల్ని బల్గేరియన్ ఫైట్ మాస్టర్ కలయాన్ ఆధ్వర్యంలో షూట్ చేశారు. బాహుబలిలో మంచు కొండల్లో జరిగే యాక్షన్ ఎపిసోడ్ను చిత్రీకరించింది కలయానే. ఆ రకంగా విన్నర్కీ బాహుబలికీ లింకు కుదిరిందన్నమాట. ఆ విషయాన్ని ప్రధానంగా చెబుతూ ప్రచారం చేసుకొంటోంది విన్నర్ చిత్ర బృందం. అయితే గ్రాండియర్ విషయంలో విన్నర్ టీమ్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది.


Baahubali action choreographer for Sai dharam's Winner

విదేశాల్లో ఒక పెద్ద పార్ట్నే షూట్ చేశారు. టర్కీలో అరుదైన లొకేషన్లని వెదికి పట్టుకొని మరీ అక్కడ కొన్ని పాటల్ని యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరించారు. అనసూయతో ఐటెమ్ పాటని కూడా విదేశాల్లోనూ షూట్ చేయడం విశేషం. ఇక ఊటీ బెంగుళూరుల్లో తదుపరి షెడ్యూల్ని జరిపి షూటింగ్ కంప్లీట్ చేసే ఆలోచనలో ఉంది చిత్రబందం. అన్నట్టు రిలీజ్ డేట్ని కూడా ప్రకటించారు. మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది.


ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విషయంలోను దర్శకుడు గోపీచంద్ మలినేని ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాడు. ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్ ను 'ఇస్తాంబుల్'లో చిత్రీకరించారు. సినిమాలో కీలకమైన సమయంలో వచ్చే ఈ యాక్షన్ ఎపిసోడ్ కి, 'బాహుబలి'కి పనిచేసిన యాక్షన్ కొరియో గ్రాఫర్ 'రఫెర్ కలియెన్' పనిచేశాడట. 'బాహుబలి'లో మంచుకొండల్లో ఆయన రూపొందించిన ఫైట్ ప్రేక్షకులకి ఎంతో థ్రిల్ ను కలిగించింది. 'విన్నర్' కోసం ఆయన రూపొందించిన ఫైట్ కూడా హైలైట్ అవుతుందనీ, విజిల్స్ పడటం ఖాయమని చెబుతున్నారు. రకుల్ కథానాయికగా నటించిన ఈ సినిమాను, ఫిబ్రవరి 24న విడుదల చేయనున్నారు.

English summary
Winner climax action episode shot in Istanbul. “Bulgarian action choreographer Kaloian, who had also worked for Baahubali has designed the climax sequence.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu