twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌కు కొత్త సమస్య.. వార్డురోబ్‌లో గుట్టలుగా డ్రెస్సులు..

    చిత్రం కోసం అదనంగా 20 కిలోల బరువు పెరిగాడు. పెరిగిన బరువు కోసం ప్రత్యేకంగా దుస్తులు కొన్నారు. ప్రస్తుతం వార్డురోబ్‌లో పేరుకుపోయిన దుస్తులను స్వచ్ఛంద సంస్థకు దానం చేసే ఆలోచన చేస్తున్నారు.

    By Rajababu
    |

    అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన బాహుబలి కోసం ప్రభాస్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. బాహుబలి అంటే ప్రభాసే అనే విధంగా ఈ చిత్రం పేరు తెచ్చింది. ఈ చిత్రం కోసం అదనంగా 20 కిలోల బరువు పెరిగాడు. పెరిగిన బరువు కోసం ప్రత్యేకంగా దుస్తులు కొన్నారు. ప్రస్తుతం బాహుబలి2 విడుదల పూర్తయింది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో తనకు పనికి రాకుండా పోయిన దుస్తులను స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వనున్నారు.

    వార్డ్‌రోబ్‌లో పేరుకు పోయిన బట్టలు

    వార్డ్‌రోబ్‌లో పేరుకు పోయిన బట్టలు

    బాహుబలి చిత్రం తర్వాత మరో చిత్రం కోసం ప్రభాస్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం కోసం నాజుకుగా కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. లావెక్కినప్పుడు కొన్న బట్టలు ఎందుకు పనికిరాకుండే పోయే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం వార్డురోబ్‌లో పేరుకుపోయిన దుస్తులను స్వచ్ఛంద సంస్థకు దానం చేసే ఆలోచన చేస్తున్నారు.

    స్వచ్ఛంద సంస్థకు దానం

    స్వచ్ఛంద సంస్థకు దానం

    దుస్తులను విరాళంగా ఇవ్వడానికి స్వచ్ఛంద సంస్థను సంప్రదించినట్టు సమాచారం. త్వరలోనే ఆ దుస్తులను స్వచ్ఛంద సంస్థకు అందజేయనున్నారు. ప్రభాస్ ధరించిన దుస్తులు వేసుకొనే అదృష్టం ఎవరికీ దక్కనుందో.. వేచి చూడాల్సిందే.

    ఈ నెల 16న ట్రైలర్.. 28న విడుదల

    ఈ నెల 16న ట్రైలర్.. 28న విడుదల

    ‘బాహుబలి: ది బిగినింగ్‌'కి కొనసాగింపుగా తెరకెక్కిన ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌' ఏప్రిల్ 28న విడుదలకు ముస్తాబవుతున్నది. ఈ నెల 16న థియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేస్తాం అని ఫేస్‌బుక్‌ పేజ్‌ ద్వారా దర్శకుడు రాజమౌళి వెల్లడించారు. ‘బాహుబలి: ది బిగినింగ్‌' ట్రైలర్‌ను విడుదల చేసినట్లే ఈసారి కూడా థియేటర్లలోనే విడుదల చేస్తాం' అని ఆయన తెలిపారు.

     సోషల్ మీడియాలో విడుదల

    సోషల్ మీడియాలో విడుదల

    ఇదివరకటి కంటే ఎక్కువ థియేటర్లలో ఉదయమే ప్రచార చిత్రం ప్రదర్శితమవుతుంది. అదే రోజు సాయంత్రం ముంబయిలో హిందీ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం జరుగుతుంది. అలాగే సామాజిక అనుసంధాన వేదికల్లోనూ విడుదల చేస్తాం'' అని నిర్మాత శోభు యార్లగడ్డ చెప్పారు.

    బాహుబలిని ఇంకా సాగదీయం..

    బాహుబలిని ఇంకా సాగదీయం..

    బాహుబలి2కు కొనసాగింపుగా మూడో చిత్రం కూడా ఉంటుందా? అన్న ప్రశ్నకు రాజమౌళి బదులిస్తూ... ‘‘మేం మొదట అనుకొన్న కథ ఈ సినిమాతోనే పూర్తవుతుంది. అంతే తప్ప దీన్ని సాగదీసే ఉద్దేశం లేదు. అయితే ఈ ఫ్రాంచైజీ మాత్రం కొనసాగుతుంది అని చెప్పారు.

    ఇలా తీస్తే.. జీవితం అయిపోతుంది..

    ఇలా తీస్తే.. జీవితం అయిపోతుంది..

    ‘బాహుబలిని తీయడానికే ఐదేళ్లు పట్టింది. ఇలాంటివి ఇంకా చేస్తే రెండు సినిమాలతోనే జీవితమే అయిపోతుంది' అని బదులిచ్చారు. ఓ సినిమాని పరిమిత వ్యయంతో తీయాలా, భారీ వ్యయంతో తీయాలా అనే విషయాన్ని కథని బట్టే నిర్ణయం తీసుకొంటానని, ఒక దర్శకుడిగా ఆ రెండు రకాల సినిమాల్నీ తీయడానికి ఇష్టపడతానని రాజమౌళి స్పష్టం చేశారు.

    English summary
    Post the release Baahubali of the sequel Prabhas will donate all the clothes in his wardrobe. Prabhas had also given everything in his wardrobe to an NGO as nothing fit him when he bulked up.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X