»   » ఇక 192 దేశాల్లో బాహుబలి... ఇప్పటివరకున్న లెక్కలు ఇవే!

ఇక 192 దేశాల్లో బాహుబలి... ఇప్పటివరకున్న లెక్కలు ఇవే!

Posted By:
Subscribe to Filmibeat Telugu

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సీరీస్ సినిమాలు ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. బాహుబలి సిరీస్‌లోని రెండు చిత్రాలు దేశంలో విడుదలైన అన్ని భాషల్లో బాక్సాఫీసు వద్ద సంచలన విజయం సాధించాయి.

ఈ ఏడాది విడుదలైన బాహుబలి-2 మూవీ ఎవరూ ఊహించని ఘన విజయం సాధించింది. ఇండియన్ సినిమా పరిశ్రమ అప్పటి వరకు చూడని రూ. 1000 కోట్లు, రూ.1500 కోట్ల మార్కును నిర్మాతలకు చూపించిన తొలి సినిమా ఇదే.


ఇప్పటి వరకు బాహుబలి 2 టోటల్

ఇప్పటి వరకు బాహుబలి 2 టోటల్

బాహుబలి 2 మూవీ ఇప్పటి వరకు రూ. 1700 కోట్ల వసూళ్లు సాధించింది. ఇండియన్ సినీ చరిత్రలో ఇది అతిపెద్ద మొత్తం. దేశం మొత్తం ఒక సినిమాను పిచ్చి పిచ్చిగా చూస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో చెప్పడానికి ఇదో నిదర్శనం.


లోకల్ హీరో బాహుబలి, దంగల్ కాదు...

లోకల్ హీరో బాహుబలి, దంగల్ కాదు...

ఇండియన్ బాక్సాఫీసు వద్ద అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం ‘బాహుబల-2' మాత్రమే. అమీర్ ఖాన్ ‘దంగల్' మూవీ చైనాలో రిలీజ్ అయి అక్కడ భారీ విజయం సాధించడం వల్ల భారీ వసూళ్లు సాధించిందే తప్ప... డొమెస్టిక్ బాక్సాఫీసు వద్ద బాహుబలిని దాటలేక పోయింది.


Baahubali Was A Starter And Baahubali 2 Will Be a Full Meal - Filmibeat Telugu
ఇక 192 దేశాల్లో బాహుబలి

ఇక 192 దేశాల్లో బాహుబలి

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ‘బాహుబలి' సిరీస్ లోని రెండు సినిమాలు ఇక ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 192 దేశాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఆన్ లైన్ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫిక్స్ సంస్థ కొనుగోలు చేసింది.


అదిరిపోయే డీల్

అదిరిపోయే డీల్

ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ సినిమా ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రాబోతోంది. ఈ రైట్స్ 4 మిలియన్ యూఎస్ డాలర్లకు(25.5 కోట్లు) అమ్ముడైనట్లు సమాచారం.


తెలుగు సినిమా ఖ్యాతి

తెలుగు సినిమా ఖ్యాతి

తమ సినిమా ద్వారా తెలుగు సినిమా ఖ్యాతి 192 దేశాలకు వ్యాప్తి చెందడం ఆనందంగా ఉందని, ఇలాంటి సినిమాలో తామూ భాగమైనందుకు సంతోషంగా ఉందని నిర్మాత శోభుయార్లగడ్డ వెల్లడించారు. థియేటర్ ద్వారా 192 దేశాల్లో ఈ చిత్రం రీచ్ కావడం అసాధ్యం. అందుకే నెట్‌ఫిక్స్‌తో టై అప్ అయినట్లు ఆయన తెలిపారు.


English summary
The online streaming rights of Baahubali (both the installments) have been sold out for a whopping amount of 4 million USD which is Rs 25.5 crores. The makers are quite excited as the film will now be available across 192 countries of the globe which is huge.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu