»   » బాహుబలికి ప్రేక్షుకుడి బలి.. ఓ దర్శకుడి వద్ద 15 వేల టికెట్లు.. బండారం బట్టబయలు..

బాహుబలికి ప్రేక్షుకుడి బలి.. ఓ దర్శకుడి వద్ద 15 వేల టికెట్లు.. బండారం బట్టబయలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి2 సినిమా టికెట్ల కోసం మండుటెండల్లో ప్రేక్షకులు నిలబడుతుంటే మరో వైపు బ్లాక్ టికెట్ దందా జోరుగా సాగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. అడ్వాన్స్ టికెట్ల కోసం కంపూటర్లు, మొబైల్ ఫోన్లతో ఆన్‌లైన్‌లో కుస్తీ పడుతుంటే భారీ సంఖ్యలో లెక్కలేనన్ని టికెట్లు పక్కదారి పడుతున్నాయి. తాజాగా బాహుబలి టికెట్లను ముందే బ్లాక్ చేసిన ఓ దర్శకుడి బండారం బయడం పడటం సినీ ప్రేక్షకులకు, అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓ దర్శకుడి వద్ద 15 వేల టికెట్లు..

ఓ దర్శకుడి వద్ద 15 వేల టికెట్లు..

సింగిల్ టికెట్ కోసం ప్రేక్షకుడు తంటాలు పడుతుంటే ఓ దర్శకుడి వద్ద 15 వేల టికెట్లు ఉన్నట్టు ఓ టెలివిజన్ చానెల్ ప్రసారం చేయడం సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. ఒక్కడే 15 వేల టికెట్లు బ్లాక్ చేస్తే సాధారణ ప్రేక్షకుడి పరిస్థితి ఏంటనే ప్రశ్న వెంటాడుతున్నది.

వారానికి సరిపడా..

వారానికి సరిపడా..

సదరు దర్శకుడు వారం రోజులకు సరిపడా దాదాపు 15 వేల టికెట్లు తన వద్ద అట్టిపెట్టుకొన్నట్టు మీడియాలో దుమారం చెలరేగడంతో ప్రేక్షకులు నివ్వెరపాటుకు గురయ్యాురు. 15 వేల టికెట్లు అంటే వాటి విలువ దాదాపు సుమారు 25 లక్షలకు పైనే ఉండవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

సొమ్ము చేసుకొనే పనిలో..

సొమ్ము చేసుకొనే పనిలో..

ప్రపంచవ్యాప్తంగా బాహుబలి2పై క్రేజ్ పెరుగడంతో ప్రతీ ఒక్కరు దానిని సొమ్ము చేసుకొనే పనిలో ఉన్నట్టు సమాచారం. దాదాపు దశాబ్ద కాలం తర్వాత తెలుగు సినిమా పరిశ్రమలో టికెట్ల బ్లాక్ దందా మరోసారి పెరిగిపోయినట్టు మీడియా కథనాన్ని వెల్లడించింది.

ప్రముఖుల హస్తం

ప్రముఖుల హస్తం

బాహుబలి టికెట్ల దందాను డిస్టిబ్యూటర్లు, కొందరు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖుల హస్తం ఉన్నట్టు ఆరోపణలు చెలరేగుతున్నాయి. ప్రేక్షకుడి జేబు గుల్లా అయ్యే పరిస్థితిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

English summary
Baahubali craze going around the world. Audience are trying to get tickets by different sources. Media reports that, there is allegations that one the film directos blocked 15 thousand tickets.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu