»   » బాహుబలి బ్రెయిన్ సర్జరీ..... సినిమా చూపిస్తూ ప్రాణాలు నిలబెట్టారు!

బాహుబలి బ్రెయిన్ సర్జరీ..... సినిమా చూపిస్తూ ప్రాణాలు నిలబెట్టారు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ చిత్రం దేశంలో అన్ని ప్రాంతాల ప్రజలను ఆకట్టకుంది.

తాజాగా బాహుబలి సినిమా ఓ నర్స్ ప్రాణాలు కాపాడేందుకు వినియోగించారు అనే విషయం తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. బాహుబలి సినిమా రీల్ లైఫ్ లో మాత్రమే కాదు, రియల్ లైఫ్‌లో కూడా అద్భుతాలు సృష్టించింది అని చర్చించుకుంటున్నారు.

వినయ కుమారి

వినయ కుమారి

గుంటూరులోని ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వినయ కుమారి అనే నర్స్ బ్రెయిన్ ట్యూమర్ చికిత్స కోసం జాయిన్ అయింది. ఆమెకు సర్జరీ చేసేందుకు బాహుబలి సినిమా సహాయం కూడా తీసుకున్నారు డాక్టర్లు. సెప్టెంబర్ 21వ తేదీన సర్జరీని విజయవంతంగా పూర్తి చేశారు.

ఎలా చేశారంటే...

ఎలా చేశారంటే...

ట్యూమర్ తొలగించేందుకు బ్రెయిన్ సర్జరీ చేసే సమయంలో ఆమె తప్పకుండా మెలకువగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. సర్జరీ చేసే సమయంలో ఆమె మెలకువగా ఉండేందుకు ల్యాప్ టాప్ లో బాహుబలి-ది కంక్లూజన్ సినిమాను ప్రదర్శించారు వైద్యులు.

డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ...

వినయ కుమారికి సర్జరీ నిర్వహించిన డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ.... సర్జరీ చేసే సమయంలో పేషెంట్ మెలకువగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకే ఆపరేషన్ చేసే సమయంలో ఆమెకు బాహుబలి సినిమా చూపించాం. ఆమె సినిమా చూస్తూ ఎంజాయ్ చేస్తుండటం వల్ల... మేము ఆమెకు ఎలాంటి నొప్పి కలగకుండా విజయవంతంగా పూర్తి చేయగలిగాము అని తెలిపారు.

బాహుబలి బ్రెయిన్ సర్జరీ

బాహుబలి బ్రెయిన్ సర్జరీ

వినయకుమారికి చేసిన సర్జరీ ఇపుడు హాట్ టాపిక్ అయింది. అంతా ఆమెకు జరిగిన సర్జరీని ‘బాహుబలి బ్రెయిన్ సర్జరీ' గా పేర్కొంటున్నారు.

English summary
According to a report in a news daily, a 43-year-old nurse named Vinaya Kumari was diagnosed with brain tumour after she suffered from fits and was admitted to a Guntur multi-speciality hospital. Considering her critical condition, the doctors performed a successful brain surgery on her on September 21. Here’s where the immense contribution of ‘Baahubali: The Conclusion’ in the successful surgery and in thus saving the nurse’s life comes into the picture.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu