»   » రాజమౌళికి కృతజ్ఞతలు ఎందుకంటే... : రవితేజ

రాజమౌళికి కృతజ్ఞతలు ఎందుకంటే... : రవితేజ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : 'బాహుబలి', 'శ్రీమంతుడు' మంచి విజయాలు సాధించడం ఎంతో ఆనందంగా ఉంది. 'బాహుబలి' విషయంలో రాజమౌళికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలుగు సినిమా గురించి బాలీవుడ్‌లోనూ చెప్పుకొనేలా చేశారు. తెలుగు సినిమాకి మర్యాద పెరిగింది. ఇక మీదట వచ్చే సినిమాలు బాగా ఆడతాయన్న నమ్మకం పెరిగింది. నా 'కిక్‌ 2'నే కాదు, 'రుద్రమదేవి' కూడా బాగా ఆడాలి అని చెప్పుకొచ్చారు రవితేజ. రవితేజ నటించిన 'కిక్‌ 2' ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

'కిక్‌ 2' గురించి మాట్లాడుతూ...

Baahubali brought respect for Telugu films- Ravi Teja

మీకో విషయం చెప్పాలి. ఇది 'కిక్‌'కు సీక్వెల్‌ కాదు. రెండూ వేర్వేరు కథలు. 'కిక్‌' శుభం కార్డులో 'కిక్‌ 2' రాబోతోందని హింట్‌ ఇచ్చాం. అయితే అప్పటికి 'కిక్‌ 2' ఆలోచనే లేదు. మూడేళ్ల క్రితం వక్కంతం వంశీ ఓ లైన్‌ చెప్పాడు. దాన్ని రాసుకొంటూ వెళ్తే ఈ సినిమాకి 'కిక్‌ 2' అనే పేరు పెడితే బాగుంటుంది అనిపించింది. 'కిక్‌'లో హీరో పేరు కల్యాణ్‌. 'కిక్‌' అంతా వాడి గోలే. ఇది వాళ్ల అబ్బాయి రాబిన్‌ హుడ్‌ కథ. వీడిదంతా 'కంఫర్ట్‌' గోల.. అదేంటన్నది సినిమా చూస్తే అర్థమవుతుంది అన్నారు.

ఈ చిత్రం తో తప్పకుండా డబుల్‌ కిక్‌ ఇస్తాం . 'కిక్‌' కంటే ఎక్కువ వినోదం ఉంటుంది. పాటలూ బాగున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా యాక్షన్‌ పార్ట్‌ బాగా వచ్చింది. 'కిక్‌'లో యాక్షన్‌కు అంత చోటు దక్కలేదు. ఈ సినిమాలో మాత్రం పోరాట దృశ్యాలు బాగుంటాయి. ఓ కమర్షియల్‌ సినిమాలో ప్రతి పాత్రకీ ప్రాధాన్యం ఉండడం చాలా అరుదుగా జరిగే విషయం. 'కిక్‌ 2'లో అది సాధ్యమైంది అన్నారు.

English summary
Ravi Teja revealed that he is elated with the success of Baahubali and thanked Rajamouli for putting Telugu people and Tollywood films on the national map
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu