»   » వారేవా క్యా సీన్ హై.. బాహుబలిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన సన్నివేశాలు ఇవే..

వారేవా క్యా సీన్ హై.. బాహుబలిని ఓ రేంజ్‌కు తీసుకెళ్లిన సన్నివేశాలు ఇవే..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు బాహుబలి మానియా కొనసాగుతున్నది. ఎవరినోటా విన్నా బాహుబలి చూశావా? చూడకపోతే ఎప్పుడు చూస్తున్నావా? చూస్తే ఎలా అనిపించింది. ఏ రేంజ్ హిట్ట? ఇలాంటి ప్రశ్నలు చకచకా వచ్చేస్తున్నాయి. సినీ అభిమానులపై ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య ఒక కొత్త లోకానికి తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. బాహుబలి చూడాలనిపించడానికి ఒక ప్రధాన కారణం బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్న ఒకటైతే. సినిమా చూసిన తర్వాత వారేవా క్యా సీన్ హై అనిపించే సన్నివేశాలు ఓ ఐదారు ఉంటాయి. అవి మీ కోసం

అమరేంద్ర బాహుబలి ఎంట్రీ

అమరేంద్ర బాహుబలి ఎంట్రీ

అమరేంద్ర బాహుబలి పట్టాభిషేకానికి ముందు రాజవంశ సాంప్రదాయం ప్రకారం రాజమాత శివగామి ఓ పూజను ప్రారంభిస్తుంది. ఆ పూజ ప్రారంభమైన తర్వాత అడుగు కూడా ఆగకుండా పూర్తి కావాలి. తలపై మంటతో ఉన్న బోనం పెట్టుకొని ఆలయాని బయలుదేరుతుంది. ఆలయానికి చేరుకొనే క్రమంలో సమీపంలోని ఏనుగులు అలజడి ప్రారంభిస్తాయి. ప్రజలందరూ చెల్లాచెదురుగా పారిపోతుంటారు. దొరికిన వాళ్లను దొరికిటనట్టు ఏనుగులు విసిరి పారేస్తుంటాయి. అలాంటి పరిస్థితుల్లో రాజమాత నడక ఆపకుండా ముందుకెళ్తుంటుంది. వెంట ఉన్న కట్టప్పను ప్రజలను కాపాడేందుకు పూనుకోమని ఆర్డర్ పాస్ చేస్తుంది. ఏనుగులు ఘీంకరించుకొంటూ శివగామి దూసుకువస్తుంటాయి. ఆ పరిస్థితుల్లో ఆలయ రథం ఉండే గది నుంచి తలుపులు బద్దలు కొట్టుకొని అమరేంద్ర బాహుబలి దూసుకొస్తాడు. ఏనుగును తప్పించి శివగామి పూజను పూర్తయ్యేలా చేస్తాడు. ఆ తర్వాత ప్రభాస్ ఏనుగును శాంతింపజేసి దాని తొండం మీదుగా ఎక్కి దానిపై ఊరేగుతాడు. ఈ సీన్‌ను రాజమౌళి అద్బుతంగా చిత్రీకరించాడు.

కుంతల దేశంలో బాహుబలి గురించి..

కుంతల దేశంలో బాహుబలి గురించి..

పట్టాభిషేకానికి ముందు దేశాటనకు వెళ్లిన కట్టప్ప, బాహుబలి కుంతల దేశానికి చేరుకొంటారు. కుంతల దేశంలో దోపిడిలకు పాల్పడే పిండారుల నుంచి ఆ దేశ ప్రజలను కాపాడుతారు. ఆ క్రమంలో దేవసేన, బాహుబలి ప్రేమించుకొంటారు. అయితే తాను ప్రేమించింది ఓ సామాన్య పౌరుడిని కాదు. ఓ క్షత్రియవంశ పుత్రుడని దేవసేన గ్రహిస్తుంది, తన అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి నీవు ఎవరు? నీ చేతులు చూస్తే యుద్ధంలో కత్తి పట్టిన యోధుడివిలా కనిపిస్తున్నావు అని నిలదీస్తుంది. అయినా సరైనా సమాధానం రాకపోవడంతో పక్కనే భగభగ మండుతున్న కాగడాతో బాహుబలి ఛాతిపై బలంగా కొడుతుంది. దాంతో బాహుబలి ఛాతిపై ఉన్న వస్త్రం కాలిపోయి ఉక్కు కవచంతో ఉన్న బాహుబలి అసలు రూపం కనిపిస్తుంది. ఈ సీన్‌ను దర్శకుడు రాజమౌళి అద్బుతంగా తీర్చిదిద్దారు. అద్భుతమైన గ్రాఫిక్స్‌ను మేలవించారు.

ఇంటర్వెల్ బ్యాంగ్..

ఇంటర్వెల్ బ్యాంగ్..

మహిష్మతీ సామాజ్యంలో అధికారం కోసం జరిగిన పోరాటంలో హోదాలు తారుమారవుతాయి. దేశ ప్రజల విశేష మద్దతు ఉన్న బాహుబులి రాజుగా పట్టాభిషేకం చేసుకోవాల్సినది పోయి సేనాధిపతిగా బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. ఆ సమయంలో ‘అమరేంద్ర బాహుబలి అను నేను.. మహిష్మతీ దేశ ప్రజల ధన, మాన, ప్రాణాలంటూ‘ ప్రమాణం చేస్తున్న సమయంలో ప్రజల స్పందన, సైనిక విన్యాసాలు తెరమీద ప్రకంపనలు సృష్టిస్తాయి. ఈ సీన్ నభూతో నభవిష్యత్ అనే విధంగా దర్శకుడు తెరకెక్కించాడు. కెమెరామెన్ సెంథిల్ కుమార్ ప్రతిభ ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి మాటలు చాలవు.

కట్టప్ప బాహుబలిని హత్య చేసే..

కట్టప్ప బాహుబలిని హత్య చేసే..

పురిటి నొప్పులతో ఉన్న భార్యను వదిలేసి తనకు ప్రాణమైన కట్టప్పను రక్షించుకోవడం అనే సీన్‌ను దర్శకుడు అద్భుతంగా తీశాడు. ఓ వైపు కట్టప్పను బతికించుకోవాలనే ఆరాటం. మరోవైపు తనను కాపాడుకోవడానికి వచ్చిన బాహుబలిని చంపడానికి కట్టప్ప పూనుకోవడం చాలా ఉద్వేగభరితంగా ఉంటుంది. చివరికి కట్టప్ప కత్తితో వెన్నుపోటు పొడిచిన తర్వాత జరిగే సన్నివేశం ప్రేక్షకుడిని ఉద్వేగానికి గురిచేస్తుంది. సీన్‌లో ఉండే ఇంటెన్సిటిని మరో దర్శకుడికి సాధ్యం కాదనే రేంజ్‌లో రాజమౌళి తెరకెక్కించాడు.

మహేంద్ర బాహుబలి వీరత్వం..

మహేంద్ర బాహుబలి వీరత్వం..

ఇక తన తండ్రి అమరేంద్ర బాహుబలికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి వెళ్తున్న మహేంద్ర బాహుబలిని ప్రజలందరూ తాకుతూ ఉండే సీన్ సినిమాను పీక్ రేంజ్‌కు తీసుకెళ్తుంది. ఈ సీన్‌లో ప్రజల ఉద్వేగాలు, ఎమోషన్స్, బాహుబలి ముఖంలో కనిపించే కసి, పగ, ప్రతీకారం వారెవ్వా అనిపించే స్థాయిలో ఉన్నాయి. పాత్ర పట్ల బాహుబలి అంకితభావం, రాజమౌళి విజన్, వీరద్దరి ఫీలింగ్స్‌ను మేళవించి సెంథిల్ కుమార్ తెరకెక్కించిన తీరు, దానికి కీరవాణి అందించిన నేపథ్య సంగీతం అన్ని ఊహలకు అందని విధంగా ఉండటం ప్రేక్షకుడిని కొత్త అనుభూతికి గురిచేసింది. బాహుబలికి ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిపెట్టానికి కారణం కాబోతున్నది.

English summary
After releasing the baahubali, Now every where discussion about the scenes in film which are extraordinary way. There are few scences in movie are unimaginable. Rajamouli vision makes silver screen wonderful.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu