»   » మగధీరను దాటడంలో బాహుబలి ఫెయిల్ (రేటింగ్స్ లిస్ట్)

మగధీరను దాటడంలో బాహుబలి ఫెయిల్ (రేటింగ్స్ లిస్ట్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి' సినిమా తెలుగు సినిమా రికార్డులన్నింటి బద్దలు కొట్టింది. ఇప్పటి వరకు హయ్యెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాగానే కాకుండా, వంద కోట్ల మార్కును సునాయాసంగా అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది.

అన్ని రికార్డులు బద్దలు కొట్టిన బాహుబలి మూవీ ఓ విషయంలో మాత్రం చతికిల పడింది. బుల్లితెరపై టీఆర్పీ రేటింగుల విషయంలో ‘బాహుబలి' ఇంకా మగధీర కంటే వెనకే ఉంది. ఇటీవల మా టీవీలో బాహుబలి సినిమా వేసారు. ఈ సినిమా ఇప్పటి వరకు ఉనప్న తెలుగు టీఆర్పీ రేటింగులన్నింటికీ బద్దలు కొడుతుందని అనుకున్నారు.

ఈ రోజు విడుదలైన టామ్ రిపోర్ట్స్ ప్రకారం...బాహుబలి సినిమా టీవీలో ప్రసారం అయిన వారంలో హయ్యెస్ట్ 21.84 టీఆర్పీ రేటింగ్ సాధించింది. అయితే మగధీర సినిమా టీఆర్పీ రేటింగును మాత్రం ఇది అధిగమించ లేక పోయింది. టీఆర్పీ రేటింగుల విషయంలో మగధరీ సినిమా ఇప్పటి వరకు రెండో స్థానంలో ఉంది. బాహుబలి ఆ తర్వాతి మూడో స్థానంతో సరిపెట్టుకుంది.

82 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో రికార్డులన్నీ బద్దలు కొట్టిన బాహుబలి..... ఈ ఒక్క విషయంలో మాత్రం సత్తా చాటలేక పోయింది. దసర సందర్భంగా బాహుబలితో పాటు పండగ చేస్కో, గోపాల గోపాల, గంగ తదితర సినిమాలు టీవీల్లో వేసారు. వీటికి వరుసగా 11.55, 9.35, 8.27 రేటింగ్ వచ్చింది.

ఇప్పటి వరకు తెలుగు టెలివిజన్ చరిత్రలో నాగార్జున నటించిన ‘శ్రీరామదాసు' చిత్రం 24 రేటింగుతో టాపులో ఉంది. తెలుగులో టాప్ 10 టీఆర్పీ రేటింగులు సాధించిన సినిమాల వివరాలు స్లైడ్ షోలో...

మగధీర-బాహుబలి

మగధీర-బాహుబలి


ఇటీవల కాలంలో టీవీలో వచ్చిన సినిమాల్లో మగధీర చిత్రం 22.7 రేటింగు దక్కించుకోగా, 21.84 రేటింగుతో బాహుబలి ఆ తర్వాతి స్థానంలో ఉంది.

అత్తారింటికి దారేది

అత్తారింటికి దారేది


పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది ఆ మద్య మాటీవీలో వేయగా 19.04 రేటింగ్ వచ్చింది.

రోబో

రోబో


రజనీకాంత్ నటించిన రోబో చిత్రం జెమిని టీవీలో వేయగా 19 రేటింగ్ వచ్చింది.

దృశ్యం

దృశ్యం


వెంకటేష్ నటించిన దృశ్యం చిత్రం జెమిని టీవీలో వేయగా 18.61 రేటింగ్ వచ్చింది.

ఈగ

ఈగ


ఈగ చిత్రం ఆ మధ్య మాటీవీలో ప్రసారం అయి 17.72 రేటింగ్ దక్కించుకుంది.

సన్నాఫ్ సత్యమూర్తి

సన్నాఫ్ సత్యమూర్తి


అల్లు అర్జున్ నటించిన సన్నాఫ్ సత్యమూర్తి మాటీవీలో ప్రసారం అయి 17.38 రేటింగ్ దక్కించుకుంది.

దూకుడు

దూకుడు


మహేష్ బాబు నటించిన ‘దూకుడు' చిత్రం మాటీవీలో వేయగా 17.1 రేటింగ్ వచ్చింది.

అల్లుడు శీను

అల్లుడు శీను


అల్లుడు శీను చిత్రం జెమిని టీవీలో వేయగా 16.71 రేటింగ్ వచ్చింది.

గోవిందుడు అందరి వాడేలే..

గోవిందుడు అందరి వాడేలే..


గోవిందుడు అందరి వాడేలే చిత్రం జెమిని టీవీలో 15.85 రేటింగ్ వచ్చింది

English summary
Baahubali shattered almost all the record of 82 years of Telugu cinema, it scored less than Magadheera and has to settle for the third place in the list of highest TRP's for Telugu films.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu