twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘బాహుబలి’ లీక్ :పగ తీర్చుకునేందుకే

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : బాహుబలి సైబర్‌ నేరగాళ్ల నుంచి తప్పించుకోలేకపోయి... 13 నిమిషాల నిడివి గల మేకింగ్‌ వీడియో లీక్‌ అయ్యిన సంగతి తెలిసిందే. చిత్ర దర్శకుడు రాజమౌళి ఈ విషయంపై సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసులో ప్రధాన నిందితుడు వర్మను సీసీఎస్‌ పోలీసుల అరెస్టు చేశారు. వర్మ ద్వారానే వీడియో లీకైనట్టు పోలీసులు నిర్ధారించారు. మకుట విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీకి వర్మనే మేనేజర్‌ కావడంతో ల్యాప్‌ట్యాప్‌ ద్వారా తన స్నేహితులకు వీడియోను సులభంగా పంపించాడని పోలీసుల విచారణలో వెల్లడైంది.

    ఈ కంపెనీలో పనిచేసిన బీవీవీఎల్‌ఎన్‌ వర్మ అనే ఉద్యోగి జనవరి మొదటి వారంలో బాహుబలి చిత్రంలోని యుద్ధసన్నివేశాల డేటాను కాపీ చేశాడు. బాహుబలి గ్రాఫిక్స్‌ పనులు జరుగుతున్న సమయంలో వర్మ మకుటలో ఐటీ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తర్వాత కంపెనీతో వివాదాలు రావడంతో ఉద్యోగాన్ని వదిలేశాడు. కంపెనీపై పగ తీర్చుకోవడానికి వర్మ బాహుబలిని అస్త్రంగా వాడుకున్నాడు.

    Baahubali Leak: Varma arrested

    కంపెనీలో పనిచేసే సమయంలో బ యటకు తీసుకొచ్చిన వీడియోను ముందుగా తన ల్యాప్‌టాప్‌లో భద్రపరుచుకుని, స్నేహితులకు, బంధువులకు పంపాడు. ఇలా ఈ సన్నివేశాలు యూట్యూబ్‌లోకి.. సామాజిక సైట్లలోకి చేరిపోయాయి. ఫిర్యాదు అందిన తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ యూనిట్‌కు సంబంధించిన మొత్తం పది మందిని ప్రశ్నించిన పోలీసులు వర్మను నిందితుడిగా నిర్ధారించారు. కేసును సైబర్‌ క్రైం ఇన్‌స్పెక్టర్‌ పి.రాజు దర్యాప్తు చేశారు.

    ప్రముఖ దర్శకుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి చిత్ర సన్నివేశాల లీకేజీ కేసును హైదరాబాద్‌ సైబర్‌ క్రైం పోలీసులు ఛేదించారు. పోలీసులు అనుమానిస్తున్నట్లుగానే గ్రాఫిక్స్‌ కంపెనీకి చెందిన ఉద్యోగే నిందితుడని తేలింది. దీనికి సంబంధించిన వివరాలను సీసీఎస్‌ ఉపకమిషనర్‌ రవివర్మ వెల్లడించారు.

    Baahubali Leak: Varma arrested

    చిత్రం ప్రథమార్థంలోని కీలక సన్నివేశాలు లీకయ్యాయని నిర్మాత, అర్కా మీడియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ శోభు యార్లగడ్డ కొద్దిరోజుల క్రితం సీసీఎస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ సన్నివేశాలు రెండు రోజుల క్రితం వివిధ సామాజిక వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్స్‌లో ప్రచారంలోకి వచ్చాయి. బాహుబలి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులను ముంబైకి చెందిన మకుట విజువల్‌ ఎఫెక్ట్స్‌ కంపెనీకి అప్పగించారు.

    హైదరాబాద్‌లోని ఆ సంస్థ శాఖలో బాహుబలి గ్రాఫిక్స్‌ వర్క్‌ జరుగుతోంది. రాజమౌళి ఇంతకుముందు రూపొందించిన ఈగ చిత్రానికి సైతం ఈకంపెనీయే గ్రాఫిక్స్‌ను వర్క్‌ చేసింది. ఈగ చిత్రంలో గ్రాఫిక్స్‌కు విశేష ఆదరణ లభించడంతో బాహుబలి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులనూ అదే కంపెనీకి అప్పగించారు.

    English summary
    12 minute video of “Baahubali” was leaked onto the internet shocking the entire team of the movie including the director SS Rajamouli. The team already lodged a complaint with the crime branch police and they finally apprehended few people and later it was revealed the video actually uploaded from America.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X