»   » సుదీప్‌కు మరో హిట్: తెలుగువాడు కాకున్నా బాహుబలికి బ్రహ్మరథం

సుదీప్‌కు మరో హిట్: తెలుగువాడు కాకున్నా బాహుబలికి బ్రహ్మరథం

Posted By:
Subscribe to Filmibeat Telugu

బెంగళూరు: భారతదేశ సినీ చరిత్రలో నిర్మించిన బాహుబలి లాంటి చిత్రాన్ని తాము ఎప్పుడు చూడలేదని కర్ణాటకలోని తెలుగు ప్రజలు అంటున్నారు. బాహుబలి చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళి ఒక గొప్ప దర్శకుడు అన్నారు, అతను మన తెలుగు వాడు అయినందకు చాల గర్వంగా ఉందని చెబుతున్నారు.

ఏ హీరో సినిమా అయినా, ఏ భాషకు చెందిన సినిమా అయినా కర్ణాటకలో ఉదయం 10.30 గంటలకు మొదటి షో ప్రదర్శించడం ఆనవాయితీ. అయితే బహుబలి సినిమా బెంగళూరు నగరంలోని అనేక థియేటర్లలో ఉదయం 6 గంటలకు ప్రత్యేక షోలు వేశారు.


గురువారం రోజు టిక్కెట్లు అన్నీ అమ్ముడు పోయాయి. టిక్కెట్లు తీసుకున్న అభిమానులు వేకువ జామున నుండి థియేటర్ల దగ్గర క్యూ కట్టారు. ప్రతేక షోలు ఉన్నాయని తెలిసి టిక్కెట్లు లేకుండ థియేటర్ల దగ్గరకు వెళ్లిన అభిమానులు చాల నిరాశకు గురైనారు.


Baahubali Movie released in karnataka

బెంగళూరు నగరంలో మల్టిఫ్లెక్స్ లలో 40 స్క్రీన్ లలో బాహుబలి సినిమా విడుదల అయ్యింది. ఇక దాదాపు 50కి పైగా సింగిల్ స్క్రీన్ థియటర్ల లో బాహుబలి విడుదల అయ్యింది. కన్నడ హీరో సుదీప్ ఈ చిత్రంలో ఉండంతో కన్నడిగులు పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గరకు పరుగు తీశారు.


భాషా బేదం లేకుండ బాహుబలి సినిమా విడుదల అయ్యింది. కర్ణాటకలోని పలు జిల్లాలలో గురువారం టిక్కెట్లు విక్రయించడం, మొదటి షో బాహుబలి రిలీజ్ కాకపోవడంతో అభిమానులు థియేటర్ల మీద రాళ్ల వర్షం కురిపించారు. కన్నడకు చెందిన పలు టీవీ చానెల్స్ లో శుక్రవారం ఉదయం నుండి బాహుబలి సినిమా చాలా బాగుందని చెబుతూ ప్రేక్షల అభిప్రయాలను ప్రసారం చేశాయి.


కన్నడ సినీరంగానికి చెందిప పలువురు దర్శకులు, నిర్మాతలు, నటీ నటులు శుక్రవారం మొదటి షోను వీక్షించి వారి అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమా చాల బాగుందని కితాబు ఇచ్చారు. కర్ణాటకలోని 10 జిల్లాలలో బాహుబలి సినిమా విడుదల అయ్యింది.

English summary
The much-awaited film "Baahubali", which is also spelled as "Bahubali", has been released on Friday, 10 July. The multilingual movie is directed by SS Rajamouli.
Please Wait while comments are loading...