»   » కేరళ వెళుతున్న ‘బాహుబలి’ యూనిట్

కేరళ వెళుతున్న ‘బాహుబలి’ యూనిట్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ప్రభాస్, అనుష్క, రానా ప్రధాన పాత్రధారులుగా ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం 'బాహుబలి'. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతున్న ఈ చిత్రం మూడో షూటింగ్ ఈ రోజుతో ముగియనుంది. ఈ చిత్రం తర్వాతి షెడ్యూల్ కేరళలో జరిపేందుకు ప్లాన్ చేస్తున్నారు.

నవంబర్ 7న అనుష్క పుట్టినరోజును పురస్కరించుకుని బాహుబలి టీం ఆమె ఫ్యాన్స్‌ను సంతోష పెట్టడానికి ప్లాన్ చేసారు. బాహుబలి సినిమాకు సంబంధించిన అనుష్క స్పెషల్ వీడియోను పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నారు. ఇటీవల ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా కూడా ఫస్ట్ లుక్‌తో పాటు మేకింగ్ వీడియో విడుదల చేసిన సంగతి తెలిసిందే. మంచి స్పందన రావడంతో పాటు సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇపుడు అనుష్కపై స్పెషల్ వీడియో విడుదల చేస్తుండటం సర్వత్రా చర్చనీయాంశం అయింది.

'బాహుబలి' సినిమా పూర్తయి 2015లో ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో.....ఈ భారీ గ్యాప్‌లో ప్లాన్ ప్రకారం సినిమాను ప్రమోట్ చేస్తూ ముందుకుసాగుతున్నాడు రాజమౌళి. అప్పటి వరకు సినిమాపై ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తి తగ్గకుండా ఉండటానికే ఈ ప్లాన్ చేసాడట రాజమౌళి. మరి రాజమౌళి ప్లాన్ ఏ మేరకు సత్ఫలితాలను ఇస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు రాణా, అనుష్క, రమ్యకృష్ణ ముఖ్య పాత్ర పాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఇంకా సత్యరాజ్, నాజర్, అడవి శేషు, సుదీప్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అవార్డ్ విన్నింగ్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ వాస్తవికత ఉట్టిపడేలా ఈ సెట్ డిజైన్ చేసారు.

ఆర్కా మీడియా బేనర్‌పై శోభు యార్లగడ్డ, కె. రాఘవేంద్రరావు, దేవినేని ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళంలో షూట్ చేస్తున్నారు. హిందీ, విదేశీ బాషల్లోనూ విడుదల చేసే అవకాశం ఉంది. దాదాపు రూ. 80 కోట్ల నుంచి రూ. 100 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈచిత్రం భారతీయ సినీ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి తెరకెక్కిస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే 'ఈగ' చిత్రంతో రాజమౌళి ఖ్యాతి అంతర్జాతీయంగా పాపులర్ అయింది. ఈ చిత్రం ఆయనకు మరింత పాపులారిటీ తెస్తుందని భావిస్తున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

English summary
Prabhas, Anushka, Rana starrer ‘Baahubali’ is currently being shot in Hyderabad. The next schedule will begin in Kerala very soon. Ace director S.S.Rajamouli directs this film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu