'బాహుబలి' మరో ప్రత్యేకత ఇది

By Srikanya

 Baahubali
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'బాహుబలి' ప్రత్యేకతల్లో మరోటి వచ్చి చేరింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ప్రఖ్యాత 'కామిక్‌కాన్‌' సమ్మేళనంలో ఈ సినిమా కూడా పాల్గొంటోంది. సినిమా ప్రేమికులు, కామిక్‌ ఆర్టిస్టులు, ప్రచురణ సంస్థలు, బొమ్మల తయారీ సంస్థల ప్రతినిధులు భాగస్వాములుగా ఉండే కార్యక్రమమిది. ప్రచురణ సంస్థలకు, డిజిటల్‌ మీడియా ప్రతినిధులకు వారధిగా పని చేసే కార్యక్రమమిది. ఆదివారం వరకు జరగనున్న ఈ కార్యక్రమంలో 'బాహుబలి' మోషన్‌ పోస్టర్‌ని ప్రదర్శిస్తారు.

ఇక ఈ చిత్రం కథ మహాభారతాన్ని పోలి ఉండబోతుందని, అన్నదమ్ముల మధ్య జరిగే అధికారం కోసం జరిగే పోరు చుట్టూ సినిమా తిరగనుంది. తమిళంలో దీనిని 'మహాబలి'గా ఏకకాలంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవలే ట్రైలర్‌ - మేకింగ్‌ వీడియోను విడుదల చేశారు. తొలి రోజు నుంచే విశేష స్పందన లభించింది. ఈ చిత్రం కోసం అక్కడ వారు సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అక్కడ కూడా రికార్డ్ స్ధాయిలో వ్యూస్ వచ్చాయి. బిజినెస్ పరంగా కూడా తమిళనాట ఓ రేంజిలో క్రేజ్ వస్తుందని అక్కడ ట్రేడ్ లో అంచనాలు మొదలయ్యాయి.

ప్రభాస్‌, రానా, అనుష్క ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మిస్తున్నారు. కె.రాఘవేంద్రరావు సమర్పకులు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. అనంతరం ఇతర భాషల్లో అనువదించి ఒకేసారి విడుదల చేస్తారు. ప్రస్తుతం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరణ జరుగుతోంది. ఈ సినిమాకోసం ఇప్పటికే ప్రధాన తారాగణమంతా కత్తి యుద్ధాలు, గుర్రపుస్వారీ నేర్చుకుని,విశ్వరూపం ప్రదర్శశిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X