»   » ప్రభాస్ ఆధార్ కార్డు ఫొటో: ఎలా ఉన్నాడో చూడండీ అంటూ షేర్ చేసుకుంటున్నారు

ప్రభాస్ ఆధార్ కార్డు ఫొటో: ఎలా ఉన్నాడో చూడండీ అంటూ షేర్ చేసుకుంటున్నారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రభాస్ లాంటి డెడికేటెడ్ హీరో లేకుంటే 'బాహుబలి' సినిమా చేయడం కష్టం అని రాజమౌళి ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించిన సంగతి తెలిసిందే. నిజమే... ప్రభాస్ మాదిరిగా ఏ స్టార్ హీరో కూడా తన నాలుగుగైదేళ్ల సమయాన్ని కేవలం ఒకే సినిమాకు కేటాయించే సాహసం చేసి ఉండేవాడు కాదేమో.అయితే ప్రభాస్ తీసుకున్న రిస్కుకు, పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలమే దక్కింది. అప్పటి వరకు కేవలం ప్రాంతీయ హీరోగా ఉన్న ప్రభాస్.... బాహుబలి రిలీజ్ తర్వాత నేషనల్ స్టార్ అయిపోయాడు. నేషనల్ రేంజ్ హీరో అంటే ఎలా ఉండాలో అన్ని రకాల ఫీచర్లూ ఉన్న కటౌట్ ప్రభాస్ ని చాలారకాల యాంగిల్స్ లో చూసి ఉంటాం కానీ ఇప్పుడు నెట్కెక్కిన ఫొటోని మాత్రం చూసి ఉండరు.

‘Baahubali’ Prabhas’ Aadhaar card details leaked?

ఇదంతా బాగానే ఉన్నా... ఆఫ్ స్క్రీన్ లో ప్రభాస్ కూడా మనలానే ఉన్నాడు చూడండంటూ సోషల్ మీడియాలోకి ఎక్కేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వార్తలో ప్రభాస్ ఆధార్ కార్డు దర్శనమిస్తోంది. ఇప్పటికే అందంగా ఉందటం అంటే ఫేస్ బుక్ ఫొటోలో అందంగా కనిపించటం కాదు ఆధార్ కార్డ్ లో కూడా అందంగా కనిపించటం అంటూ వచ్చే జోకులు చూసే ఉంటారు. ఇప్పుడు ఈ ఫొటో చూసినా అదే రకంగా కనిపిస్తూ నవ్వు పుట్టిస్తోంది. 'బాహుబలి అయినా మరే సూపర్ హీరో అయినా ఆధార్ కెమెరా ముందుకొచ్చాక ఇలా ఉండాల్సిందే అంటూ పోస్ట్ చేసిన ఫొటో నెటిజన్లని విపరీతంగా నవ్విస్తోంది.


‘Baahubali’ Prabhas’ Aadhaar card details leaked?

అయితే సోషల్ మీడియాలో వచ్చిన ప్రభాస్ ఆధార్ కార్డు అసలైనదా?... కాదా? అన్న విషయంపై పలు వెబ్సైట్లు పేర్కొన్నట్టు నిజంగా ఈ ఫొటో అనుమానాస్పదమే. ఎందుకంటే ఆధార్ కార్డ్ ఈమధ్య నే కొత్తగా వచ్చిందేం కాదు కనీసం ఒక ఆరేళ్ళకు ముందే వచ్చింది. కానీ ఇక్కడ మాత్రం లేటెస్ట్ లూక్ కి దగ్గరగా ఉంది. ఎవరో నవ్వుకోవటానికి చేసిన ప్రయత్నం కూడా కావచ్చు. ఏదేమైనా... ప్రభాస్ ఆధార్ కార్డు పేరిట వచ్చేసిన ఆ కార్డు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయిందనే చెప్పాలి.


English summary
Aadhaar card details have gone viral on social media. The details it is being said are photoshopped and thus fake, but the card carries the real name of the star.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu