»   » అభిమానులకు ప్రభాస్ సారీ.. ఇక ముందు అలా జరగదు.

అభిమానులకు ప్రభాస్ సారీ.. ఇక ముందు అలా జరగదు.

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఏ సినీ నటుడి అభిమానులైనా తమ హీరో ఏడాదికి ఎక్కువ సినిమాల్లో కనిపించాలని కోరుకొంటారు. ప్రభాస్ అభిమానులు కూడా అలా కోరుకోవడంలో తప్పేమీ లేదు. కానీ గత ఐదేండ్లలో ప్రభాస్ నటించినవి రెండే రెండు చిత్రాలు. అవి కూడా బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కన్‌క్లూజన్ సినిమాలే. ప్రతి చిత్రానికి మధ్య రెండేళ్ల గ్యాప్ ఉండటంపై ఇటీవల బాహుబలి2 ప్రమోషన్ కార్యక్రమంలో అభిమానులకు ప్రభాస్ క్షమాపణలు చెప్పాడు.

మిర్చి తర్వాత రెండేళ్లకు..

మిర్చి తర్వాత రెండేళ్లకు..

బాహుబలి చిత్రానికి ముందు ప్రభాస్ నటించిన చిత్రం మిర్చి. ఆ సినిమా 2013 ఫిబ్రవరి 8 తేదీన విడుదలైంది. కొరటాల శివ దర్శకత్వం వహించిన మిర్చి ప్రభాస్ కెరీర్‌లోనే భారీ హిట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత బాహుబలి 2015 జూలై 10న విడుదలైంది. అంటే దాదాపు మిర్చి తర్వాత రెండున్నర ఏళ్లు గ్యాప్. బాహుబలి సంచలన విజయం సాధించింది కాబట్టి అభిమానులకు నిరాశ కలుగలేదు.

ప్రభాస్ ఆవేదన..

ప్రభాస్ ఆవేదన..

బాహుబలి 1 చిత్రం తర్వాత అంటే దాదాపు రెండు సంవత్సరాల అనంతరం బాహుబలి2 విడుదల కానున్నది. మంచి రేంజ్‌లో ఉన్న హీరోలు రెండేళ్లకోసారి సినిమా తీయడం ఎంతైనా అభిమానులకు జీర్ణించుకోలేని విషయం. ఈ విషయంపై ప్రభాస్ కూడా పలు సందర్భాల్లో తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఫ్యాన్స్‌కు ఇబ్బందే..

ఫ్యాన్స్‌కు ఇబ్బందే..

బాహుబలి2 విడుదలకు ముందు పలు టీవీ చానెళ్లతో ప్రభాస్, అనుష్కతో కలిసి ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ చిత్రానికి రెండేళ్ల గ్యాప్ ఉండటం నా ఫ్యాన్స్‌కు ఇబ్బందిగా మారింది. బాహుబలి సినిమా నేపథ్యంలో గత ఐదేండ్లలో రెండు సినిమాలు చేయడం అభిమానులకు నచ్చడం లేదు. అందుకు నా అభిమానులక క్షమాపణ చెప్తున్నాను. ఇక నుంచి అలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకొంటున్నాను అని ప్రభాస్ తెలిపాడు.

ఏడాదికి రెండు సినిమాలు

ఏడాదికి రెండు సినిమాలు

బాహుబలి తర్వాత ప్రతీ ఏడాదికి రెండు సినిమాలు చేయాలని అనుకొన్నాను. ప్రతీ సంవత్సరం రెండు సినిమాలు విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నాం. కొన్నిసార్లు క్వాలిటీ కోసం సాధ్యపడకపోవచ్చు. అయినా ఏడాదికి రెండు సినిమాలు గ్యారెంటీగా విడుదలయ్యేలా ప్లాన్ చేస్తున్నాను. అది జరుగుతుంది. ఇంతగా నా సినిమాల కోసం ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్న అభిమానులకు మరోసారి క్షమాపణ చెప్తున్నాను. ఇక నుంచి సినిమాలు చేయడంలో దూకుడు కొనసాగుతుందని ప్రభాస్ అన్నాడు.

ఏప్రిల్ 28న బాహుబలి2

ఏప్రిల్ 28న బాహుబలి2

బాహుబలి సిరీస్‌లో భాగంగా బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రం ఏప్రిల్ 28న విడుదలకు సిద్ధమవుతున్నది. ఈ చిత్రంలో అనుష్క, రానా దగ్గుబాటి, తమన్నా, నాజర్, రమ్యకృష్ణ తదితరులు నటించారు. దర్శకుడు రాజమౌళి దీనిని అద్భుతంగా తీర్చిదిద్దినట్టు వార్తలు వస్తున్నాయి.

English summary
Baahubali Hero Prabhas gives assurance to Fans that he will do two film in year. according to his promise, that he has been in a plan to release two movies in a year. Baahubali the conclusion is set release on April 28 with a bang.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu