బుర్జ్ ఖలీఫాపై ప్రభాస్.. టాలీవుడ్‌లో కనీవిని ఎరుగని విధంగా..
బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న చిత్రం సాహో. చారిత్రక నేపథ్యంతోపాటు అత్యంత సాంకేతిక విలువలతో ఈ చిత్రం రూపొందుతున్నది. ఈ చిత్రంలోని యాక్షన్ సీన్లను ప్రతిష్ఠాత్మకంగా రూపొందించేందుకు సాహో యూనిట్ విదేశాల్లో షూటింగ్ జరుపుకొంటున్నది. సాహో షూటింగ్‌కు సంబంధించిన మరిన్నీ వివరాలు ఇవిగో..

విదేశాల్లో సాహో ఫైట్స్
సుజిత్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సాహో చిత్రం సన్నివేశాలను అబుదాబీ, దుబాయ్, రొమానియా దేశాల్లో ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. గతంలో కూడా అబుదాబీలో కొన్ని సన్నివేశాలను షూట్ చేసిన సంగతి తెలిసిందే.
Recommended Video


భారీగా యాక్షన్ సీన్లు
సాహో చిత్రానికి కీలకంగా మారే యాక్షన్ పార్టును చిత్రీకరించే పనిలో దర్శకుడు సుజిత్ తలమునకలై ఉన్నాడు. ఈ షెడ్యూల్‌లో రూపొందించే యాక్షన్ సీన్లు సినిమాకు హైలెట్‌గా నిలుస్తాయట.

బుర్జ్ ఖలీఫాపై ప్రభాస్
ప్రభాస్ పాల్గొనే పోరాట సన్నివేశాలను దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై చిత్రీకరించనున్నారు. ఈ ఫైట్స్‌ను హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీబేట్స్ డిజైన్ చేస్తున్నారు. టాలీవుడ్‌లో కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించేందుకు కెన్నీ టీమ్ ప్లాన్ చేసింది.

ప్రభాస్‌తో శ్రద్ధాకపూర్
సాహో చిత్రం కోసం తొలిసారి ప్రభాస్‌తో బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ జతకడుతున్నది. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో పలువురు బాలీవుడ్ నటులు కూడా కీలక పాత్రలను పోషిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.

కీలకపాత్రలో అరుణ్ విజయ్
తమిళంలో విలక్షణ నటుడు అరుణ్ విజయ్ కూడా సాహోలో ఓ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం అరుణ్ విజయ్ మణిరత్నం రూపొందిస్తున్న నవాబ్ (తమిళంలో చెక్క చివంథ వానమ్) అనే చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు.


Click it and Unblock the Notifications











