»   »  ప్రభాస్‌ మాట్లాడి,వదిలిందే ఇప్పుడు వైరల్ (వీడియో)

ప్రభాస్‌ మాట్లాడి,వదిలిందే ఇప్పుడు వైరల్ (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: 'బాహుబలి' చిత్రాన్ని విజయవంతం చేసిన ఫ్యాన్స్ కు హీరో ప్రభాస్‌ కృతజ్ఞతలు తెలిపారు. 'అభిమానులు ఈ చిత్రం కోసం రెండున్నర సంవత్సరాలు వేచి చూశారు. ఇంతటి నిరీక్షణ అనంతరం చిరస్థాయిగా నిలిచిపోయే విజయాన్ని అందించారు' అంటూ భావోద్వేగానికి గురయ్యారు.

ప్రభాస్ తన అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా అభిమానుల కోసం ఒక ప్రత్యేక వీడియో పోస్టు చేశారు. తనదైన శైలిలో అభిమానులను డార్లింగ్స్‌ అని సంబోధిస్తూ... మీ అభిమానానికి చాలా కృతజ్ఞతలు అంటూ ధన్యవాదాలు తెలిపారు. ఇప్పుడు వీడియో ఎక్కుడ చూసినా షేర్స్ పొందుతూ ముందుకు వెళ్లుతోంది. ఆ వీడియో ఇప్పటికీ మీరు చూడకపోతే ఇక్కడ చూసేయండి మరి...

Thank you all..

Posted by Prabhas on 1 August 2015

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

మరో ప్రక్కకగతకొంతకాలంగా 'దిల్‌వాలే' చిత్రీకరణ కోసం బల్గేరియాలో ఉన్న షారుఖ్‌ ఇటీవలే అక్కడి షెడ్యూల్‌ పూర్తి చేసుకొని తిరిగొచ్చాడు. వచ్చిన వెంటనే తన కుటుంబంతోపాటు 'బాహుబలి'ని చూసాడు షారుఖ్‌.

Baahubali: PRABHAS released a MESSAGE video TO FANS!

అనంతరం ''ఎంతో కష్టపడి తీసిన సినిమా 'బాహుబలి'. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరూ అందరికీ స్ఫూర్తివంతంగా నిలిచారు. ఇలాంటి ఓ ముందడుగు వేయాలని ప్రయత్నిస్తేనే ఉన్నతస్థానాలకు ఎదగగలం'' అని ట్వీట్‌ చేశాడు షారుఖ్‌. ప్రభాస్‌, రానా, తమన్నా, అనుష్క ప్రధాన పాత్రల్లో రూపొందిన ఈ సినిమా రెండో భాగం చిత్రీకరణ త్వరలో మొదలుకానుంది.

బాక్సాఫీసు దగ్గర సరికొత్త రికార్డులు లిఖిస్తూ.. దూసుకుపోతున్న 'బాహుబలి' తెలుగు సినిమాని రూ.400 కోట్ల మైలురాయి దగ్గరకు చేర్చేసింది. కేవలం కొద్ది రోజుల్లోనే ఈ ఘనత సాధించిన చిత్రంగా 'బాహుబలి' చరిత్ర సృష్టించింది.

మంగళవారం నాటికి ప్రపంచవ్యాప్తంగా 'బాహుబలి' రూ.220 కోట్లకు పైచిలుకు వసూళ్లు సాధించింది. హిందీ వెర్షన్‌ రూపంలో దాదాపు రూ.35 కోట్ల వసూళ్లు అందుకొంది. ఓ దక్షిణాది చిత్రం హిందీలో అనువాదమై ఈ స్థాయిలో వసూళ్లు దక్కించుకోవడం బాలీవుడ్‌ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. తొలి రోజే సరికొత్త రికార్డులను నెలకొల్పిన 'బాహుబలి' ఆ దూకుడు 5 రోజులూ కొనసాగించింది.

మరీ ముఖ్యంగా తొలి వారాంతంలో రూ. 105 కోట్ల షేర్‌ సాధించిన తొలి భారతీయ చిత్రంగా 'బాహుబలి' జెండా ఎగరేసింది. అంతకు ముందు 'ధూమ్‌' (రూ.100 కోట్లు), 'హ్యాపీ న్యూ ఇయర్‌' (రూ.99 కోట్లు) రికార్డు 'బాహుబలి' తిరగరాసినట్త్టెంది.

English summary
Prabhas has expressed his heartfelt thanks to his darlings fans. He uploaded a video carrying his thanks giving message to his fans. It came as a surprise to the fans and in no time it went viral.
Please Wait while comments are loading...