»   » బాహుబలి వెనక వాస్తవాలు: 2011లో 100 కోట్లతో మొదలై....

బాహుబలి వెనక వాస్తవాలు: 2011లో 100 కోట్లతో మొదలై....

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లో పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ సందర్భంగా ప్రదర్శించి ఏవీ పలు ఆసక్తికర విషయాలు ప్రేక్షకులకు తెలిసేలా చేసాయి. ఈ చిత్రానికి ఈ చిత్రానికి బీజం పడింది 2011లోనే పడిందట. అపుడు కేవలం 100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమా తీద్దామనుకున్నారట.

అంత మార్కెట్ ఉండదేమో అనే అనుమానం

అంత మార్కెట్ ఉండదేమో అనే అనుమానం

ఎంత రాజమౌళి- ప్రభాస్ కాంబినేషన్ అయినా 100 కోట్ల మార్కెట్ ఉండదేమో అనుమానం వచ్చినపుడు బడ్జెట్ తగ్గించొద్దు మార్కెట్ పెంచుదాం అంటూ ముందడుగు వేసారట బాహుబలి నిర్మాతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ.

మార్కెట్ విస్తరించడంలో భాగంగా

మార్కెట్ విస్తరించడంలో భాగంగా

మార్కెట్ విస్తరించడంలో భాగంగా ఆ క్రమంలో తొలి అడుగుగా బాహుబలి చిత్రాన్ని తమిళ బాషకు విస్తరించారు. ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ను కలిసి జాతీయ స్థారికి తీసుకెళ్లారు.

400 కోట్ల పైచిలుకు బడ్జెట్

400 కోట్ల పైచిలుకు బడ్జెట్

బాహుబలి సినిమా పరిధి విస్త్రతమై రెండు భాగాలకు విస్తరించి బడ్జెట్ 400 కోట్ల రూపాయలకు పైగా పెరిగినా నిర్మాతలు వెనక్కి తగ్గలేదు. సామాజిక మాధ్యంలో మేకింగ్ వీడియోలు, టీజర్ పెడుతూ ఈ సినిమా చూసి తీరాలి అనే ఆసక్తి పదింతలు చేస్తూ బాహుబలి కంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ పాలోయింగ్ సృష్టించారు.

ప్రపంచానికి చాటి చెప్పారు

ప్రపంచానికి చాటి చెప్పారు

అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, బెల్జియం, దక్షిణ కొరియా ఇలా అనేక దేశాలలో 50కి పైగా ఫిల్మ్ ఫెస్టివల్స్ లో బాహుబలి ప్రచార చిత్రాలను ప్రదర్శిస్తూ ఎక్కడో తెలుగు నాట వెండి తెరపై ఓ అద్భుతం ఆవిష్కించబడుతోందని ప్రపంచానికి చాటి చెప్పారు. హాలీవుడ్ రిపోర్టర్, ఫోర్బ్స్, ది గార్డియన్ లాంటి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు ఈ చిత్రం కవరేజికి తరలి వచ్చి అద్భుత కథనాలతో ప్రశంసలు కురిపించేలా చేసారు.

కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది వారి వల్లే

కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది వారి వల్లే

నిర్మాతలు చేసిన కృషి ఫలితంగా బాహుబలి తెలుగు రాష్ట్రాల ఎల్లలు దాటి, పొరుగు రాష్ట్రాల పరుధులు దాటి అనేక దేశాలలో స్థానిక బాషలలో కూడా విడుదలై కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. దే ప్రొడ్యూస్ క్యూరియాసిటీ, దే ప్రొడ్యూస్ హైప్, దే ప్రొడ్యూస్ బాహుబలి వారే ఆర్కా మీడియా అధినేతలు ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ.

English summary
Baahubali project starts in 2011with just 100 cr estimation. Baahubali 2: The Conclusion (English: The One with Strong Arms) is an upcoming Indian epic historical fiction film directed by S. S. Rajamouli. It is the continuation of Baahubali: The Beginning. Initially, both parts were jointly produced on a budget of ₹2.5 billion (US$37 million), however the budget of the second part was increased laterBaahubali: The Conclusion has made a business of ₹5 billion (US$74 million) before release.[5] The film is scheduled for a worldwide release on 28 April 2017.[2] Baahubali 2 will be the first Indian film to be released in 4K High Definition format, requiring many of the theaters to upgrade projectors.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu