»   » ఈ ప్రయాణం ఒక నరకం, ప్రభాస్ కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదు: రాజమౌళి

ఈ ప్రయాణం ఒక నరకం, ప్రభాస్ కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదు: రాజమౌళి

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: తనతో పాటు గత మూడున్నర సంవత్సరాలుగా జర్నీ చేస్తున్న యంగ్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌కు ప్రముఖ దర్శకుడు రాజమోళి సోషల్‌మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలిపారు.

'బాహుబలి' కోసం ప్రభాస్‌ మూడున్నర సంవత్సరాలు కష్టపడ్డాడని.. ఈ ప్రయాణం ఒక నరకం లాంటిదని పేర్కొన్నారు. 'బాహుబలి' సినిమాపై ప్రభాస్‌కు ఉన్నంత నమ్మకం ఇంకెవరికీ లేదన్నారు. అందుకు ప్రభాస్‌కు కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

ఇక ఈ చిత్రం కెమెరామెన్ సెంధిల్ సైతం షూటింగ్ పూర్తైన సందర్బంగా తమ ముఖాలు ఎలా వెలిగిపోతున్నాయో చూడమంటూ ఫొటోతో ట్వీట్ చేసారు.

2015లో విడుదలైన 'బాహుబలి' భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలైన ప్రపంచవ్యాప్తంగా విమర్శకుల ప్రశంసలతో పాటు ఎన్నో అవార్డులు సాధించింది. దీనికి కొనసాగింపుగా తెరకెక్కుతున్న 'బాహుబలి- ది కంక్లూజన్‌' ఈ ఏడాది ప్రథమార్థంలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

'బాహుబలి' ..ఒక్క తెలుగు ఇండస్ట్రీనే కాదు కోలీవుడ్,బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను బద్దలుకొట్టిన చిత్రంగా సంచలనం సృష్టించింది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కొత్త రికార్డులను క్రియేట్ చేసింది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 'శివుడు', 'బాహుబలి' పాత్రలలో అదరగొట్టాడు. అప్పటి వరకు ఒక్క టాలీవుడ్ కే పరిమితమైన ప్రభాస్ ఇమేజ్ బాలీవుడ్, కోలీవుడ్ లో ఒక్కసారి పెరిగిపోయింది.

ఒక రకంగా చెప్పాలంటే ఈ చిత్రం తీసిన దర్శకుడు రాజమౌళి, నటులు ప్రభాస్,రానాలకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇప్పటికే ఈ సినిమాల చాలా అవార్డులు వచ్చాయి. ఈ చిత్రంలో ప్రభాస్ అన్న భల్లలదేవగా, విలన్ పాత్రలో రానా అద్భుతంగా నటించాడు. 'బాహుబలి' చిత్రంలో ప్రభాస్, రానాల తల్లిగా 'శివగామి' పాత్రలో రమ్యకృష్ణ నటన అద్భుతం.

Baahubali:Rajamouli thanks to Prabhas

సినిమాకు పవర్ ప్యాక్ గా రమ్యకృష్ణ తన నటనతో ఆకట్టుకుంది. అలాగే అవంతిక పాత్రలో తమన్నా, కట్టప్ప పాత్రలో సత్యరాజ్, దేవసేన పాత్రలో అనుష్క నటించారు. ఇకపోతే ఈ చిత్రం చివరలో ఎంతో ప్రేమతో చూసుకునే అమరేంద్ర బాహుబలి ని కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. దీనిపై అనేక కథనాలు వచ్చినా అసలు విషయం సినిమా చూసిన తర్వాత తెలుసుకోవాలంటున్నారు రాజమౌళి. 'బాహుబలి' చిత్రానికి సీక్వెల్ గా 'బాహుబలి- ది కంక్లూజన్' చిత్రం తెరకెక్కుతుంది. 'బాహుబలి- ది కంక్లూజన్' చిత్రాన్ని ఈ సంవత్సరమే రిలీజ్ చేస్తున్నారు.

ఇక బాహుబలి-2 తర్వాత ప్రభాస్ చేయబోయే ప్రాజెక్టు ఆల్రెడీ ఫిక్స్ అయింది. సుజిత్ సింగ్ దర్శకత్వంలో ప్రభాస్ తన తర్వాతి సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారిగా పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. యాక్షన్ ఎంటర్టెనర్ గా ఈ సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.

సుజిత్ తో సినిమా తర్వాత ప్రభాస్ మరో సినిమాకు కూడా కమిట్ అయినట్లు సమాచారం. ఇదొక రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టెనర్ గా ఉంటుందని తెలుస్తోంది. గతంలో 'జిల్' లాంటి ప్లాప్ సినిమాను తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా ఉండబోతోంది. ఓ ప్లాప్ డైరెక్టర్ తో ప్రభాస్ రొమాంటిక్ మ్యూజికల్ ఎంటర్టెనర్ కమిట్ అవుతాడని బహుషా ఎవరూ ఊహించి ఉండరు. అయితే రాధాకృష్ణ చెప్పిన స్క్రిప్టు ఆసక్తికరంగా ఉండటంతో ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

English summary
srajamouli tweeted: "And thats a wrap 4 prabhas3.5 years. Onehellof a journeyThanks darling.No one had as much belief on this project as you. That means a lot."
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu