»   » బాహుబలి మరో సంచలనం.. టెలివిజన్ తెరపై సీరియల్‌గా.. 7న బాహుబలి1 రీరిలీజ్

బాహుబలి మరో సంచలనం.. టెలివిజన్ తెరపై సీరియల్‌గా.. 7న బాహుబలి1 రీరిలీజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది చిత్ర పరిశ్రమను ప్రధానంగా తెలుగు సిని పరిశ్రమను అందలమెక్కించిన బాహుబలి చిత్రం మరోసారి ప్రేక్షకులను కనువిందు చేయడానికి సిద్ధమవుతున్నది. 2015లో విడుదలైన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 7న మరోసారి దేశవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. హిందీ వెర్షన్ ప్రమోట్ చేస్తున్న ప్రముఖ దర్శకుడు కరణ్ జోహర్ బాహుబలి రిలీజ్ గురించి ట్వీట్ చేశారు. బాహుబలి ది కన్‌క్లూజన్ చిత్రాన్ని కూడా బాలీవుడ్‌లో విడుదల చేసే బాధ్యతను కరణ్ భుజాన వేసుకొన్న సంగతి తెలిసిందే.

చూడని వారికి మరో అవకాశం

చూడని వారికి మరో అవకాశం

బాహుబలి చిత్రానికి సంబంధించిన మధుర స్మృతులను మరోసారి గుర్తు చేయడానికి సమయం ఆసన్నమైంది. బాహుబలిని ఇప్పటివరకు చూడని వారికి మరో అవకాశం. ఈసారి ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. బాహుబలి ది బిగినింగ్ ఏప్రిల్ 7న విడుదల అవుతున్నది అని కరణ్ ట్వీట్‌లో పేర్కొన్నారు.

శివగామి నుంచి రాజమాత వరకు..

శివగామి నుంచి రాజమాత వరకు..

బాహుబలి కథకు సంబంధించిన మూడు పుస్తకాలు రానున్నాయి. ఆ సిరీస్‌లో భాగంగా తొలి పుస్తకం బాహుబలి ది రైజ్ ఆఫ్ శివగామిని ఢిల్లీలో గురువారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, రాజమౌళి, రచయిత ఆనంద్ నీలకంఠన్ పాల్గొన్నారు. శివగామి నుంచి మహిష్మతి సామ్రాజ్యానికి రాజమాతగా ఎదిగే క్రమం వరకు ఈ పుస్తకంలో ప్రస్తావించారు.

. తెరపై బాహుబలి సీరియల్..

. తెరపై బాహుబలి సీరియల్..

ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ.. బాహుబలికి సంబంధించిన మూడు పుస్తకాల ఆధారంగా టెలివిజన్ సిరీస్ తీసుకురానున్నాము. అయితే రోజువారి సీరియల్స్ మాదిరిగా ఉండవు. సీజనల్‌గా సీరియల్స్ ప్రసారమవుతాయి అని అన్నారు.

రెండేళ్లు ఒపిక పట్టారు.. మరో నెల ఆగండి..

రెండేళ్లు ఒపిక పట్టారు.. మరో నెల ఆగండి..

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్నకు సమాధానిమిస్తూ ఆ ప్రశ్న కోసం రెండేళ్లు ఆగారు. మరో నెల ఆగితే మీకే తెలుస్తుంది అని అన్నారు. బాహుబలి తర్వాత ఈ ప్రశ్న దేశంలోని అన్ని వర్గాలను వెంటాడుతున్నది. బాహుబలిని కట్టప్ప చంపడం సెన్సేషనల్‌గా మారింది.

దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో..

దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో..

బాహుబలి ది బిగినింగ్ విడుదలైన రెండేళ్ల తర్వాత బాహుబలి ది కన్‌క్లూజన్ రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ చిత్రం దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఏప్రిల్ 28న విడుదల కానున్నది. ఈ చిత్రంలో ప్రభాస్, రానా దగ్గుబాటి, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించారు.

English summary
Baahubali books to be made into TV series, confirms SS Rajamouli. He revealed at the book launch of The Rise of Sivagami that a television series will be made on the book trilogy. We are planning to make a TV series based on the three books. It will not be like the daily soaps that we usually see on TV. What we are planning to make is a seasonal series.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X