»   » కాలకేయ ప్రభాకర్‌కు బంపర్ ఆఫర్.. ప్రముఖ హీరో చిత్రంలో విలన్‌గా..

కాలకేయ ప్రభాకర్‌కు బంపర్ ఆఫర్.. ప్రముఖ హీరో చిత్రంలో విలన్‌గా..

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్ర ఎంత సంచలనం రేపిందో కాలకేయ పాత్ర కూడా అంతే క్రేజ్ వచ్చింది. కాలకేయ పాత్రలో నటించిన ప్రభాకర్ బాహుబలి తర్వాత చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ సెలెక్టివ్ పాత్రలను ఎంచుకొంటున్నారు. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా నటిస్తున్న చిత్రంలో విలన్ పాత్రను దక్కించుకొన్నాడు. ఈ చిత్రంలో లక్ష్మీమీనన్, ఆర్జే బాలాజీ, అశ్విన్ తదితరులు నటిస్తున్నారు.

ప్రభుదేవా చిత్రంలో..

ప్రభుదేవా చిత్రంలో..

తమిళంలో ప్రభుదేవా యంగ్ మంగ్ సంగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో ప్రభుదేవా స్టంట్ మాస్టర్‌గా కనిపిస్తారు. ఈ చిత్రంలో విలన్ పాత్రను దక్కించుకొన్నట్టు మీడియాకు కాలకేయ ప్రభాకర్ వెల్లడించాడు.

ప్రభాకర్ విలన్‌గా

ప్రభాకర్ విలన్‌గా

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో యంగ్ మంగ్ సంగ్ దర్శకుడు ఎంఎస్ అర్జున్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాకర్ విలన్ పాత్రను పోషిస్తున్న వార్త నిజమే. ఆ పాత్ర గురించి చెప్పి ఇప్పుడే ఆసక్తిని పోగొట్టడం ఇష్టం లేదు. ఈ చిత్రంలో ప్రభాకర్ పాత్ర చాలా గంభీరంగా ఉంటుంది అని తెలిపారు.

చైనాకు యూనిట్

చైనాకు యూనిట్

ఈ చిత్రంలో ప్రభుదేవా విభిన్నమైన పాత్రను పోషిస్తున్నాడు. 1980 బ్యాక్ డ్రాప్‌గా మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంగా సినిమా తెరకెక్కుతున్నది. ఈ చిత్రం కోసం కుంగ్ ఫూ శిక్షణ పొందనున్నారు. రియల్ ఫైటర్ల పర్యవేక్షణలో శిక్షణ పొందేందుకు టీమ్ త్వరలోనే చైనాకు వెళ్లనున్నది అని అర్జున్ తెలిపాడు

ప్రభుదేవా కామెడీ..

ప్రభుదేవా కామెడీ..

చైనాలో జరిగే సింగిల్ షెడ్యూల్‌లోనే సినిమా చిత్రీకరణ పూర్తి చేస్తాం. ప్రభుదేవా కామెడీకి ప్రేక్షకులు థ్రిల్ అవుతారు. ఈ చిత్రంలో ఆయనది అద్భుతమైన పాత్ర. లక్ష్మీ మీనన్, ఆర్జే బాలాజీ పాత్రలు పోటాపోటీగా ఉంటాయి అని దర్శకుడు అర్జున్ వెల్లడించాడు.

English summary
Remember Prabhakar, who played the menacing leader of the savage group Kalakeya in the first part of Baahubali? He plays the antagonist in actor-filmmaker Prabhudheva’s upcoming Tamil film Yung Mung Sung. “Prabhakar plays the villain. I can’t spoil the fun by talking about his character now but I can assure you he doesn’t play the typical antagonist,” the film’s director M.S Arjun told media.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu